NTV Telugu Site icon

Annamalai: తమిళనాడు బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షుల మధ్య ‘‘రౌడీ షీటర్’’ వ్యాఖ్యల వివాదం..

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ అన్నామలై ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగైని ఉద్దేశిస్తూ హిస్టరీ-షీటర్‌గా పేర్కొన్నారు. దీనిపై అన్నామలై తనకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే పరువునష్టం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసు పెడతానని హెచ్చరించారు. దీనికి బుధవారం అన్నామలై స్పందిస్తూ, తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన అన్నామలై, ఈ కేసును కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

READ ALSO: ARMY: ఉగ్రవాదుల ప్రణాళికలను..భారత ఆర్మీ పసిగట్టకపోవడానికి కారణం ఇదే..

ఈ వారం ప్రారంభంలో తమిళనాడు బీఎస్పీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురయ్యాడు. ఆయనకు సంతాపం తెలుపుతూ అన్నామలై ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఎవరూ లేనిని అన్నారు. దీనిపై సెల్వపెరుంతగై స్పందిస్తూ, అన్నామలై పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 1971 కేసుల్లో ప్రమేయం ఉన్న 261 మందిని బీజేపీలో చేర్చుకున్నారని, కొందరు ఆఫీస్ బేరర్లు కూడా అయ్యారని చెప్పారు. “తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అన్నామలై బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఏ+ గ్రేడ్ రౌడీలను, సంఘవిద్రోహులను పార్టీలో నియమించారు, వారిలో 261 మందిపై 1,971 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ఆయన నన్ను హిస్టరీ షీటర్‌గా పిలిచారు. వీటిని నిరూపించాలి’’ అని కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ చాలా పాత పార్టీ, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హత్యానేరం, గుండా యాక్ట్ కింద కేసులు నమోదై జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉందా..? అని అన్నామలై ప్రశ్నించారు. సెల్వపెరుంతగై గూండా యాక్ట్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడయ్యాడని అన్నారు. అతను ఐదు పొలిటికల్ పార్టీలు మారారని చెప్పారు. అతను ఉన్నత పదవిలో ఉంటూ బీజేపీలో చేరిన వారిని రౌడీలని పిలుస్తున్నారని, అతను తనను తాను గాంధీ శిష్యుడిగా చెప్పుకుంటారు, గుండా చట్టం కింద జైలుకు వెళ్లాడు. మనీలాండరింగ్, సీబీఐ కేసులు ఉన్నాయని ఆరోపించారు.