Site icon NTV Telugu

Anant ambani wedding: అనంత్-రాధిక పెళ్లి వేదిక ఇదే.. వీడియో వైరల్

Marriage

Marriage

మరికొన్ని గంటల్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి పీటలెక్కనున్నారు. మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటి కాబోతుంది. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రకరకాలైన పూలతో అలంకరణ చేశారు. కల్యాణ వేదికకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Anant Ambani Wedding: అంబానీ పెళ్లి ఎఫెక్ట్.. వారందరికీ వర్క్ ఫ్రం హోం..

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం ఈరోజు రాత్రి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఇక పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. సంగీత విద్యాంసులు కల్యాణ మండపంలో అలరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Anant ambani wedding: కొత్త జంటను చూసి భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ

ఇదిలా ఉండగా.. వివాహ వేడుకకు కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, రామ్ చరణ్, యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జే వై. లీ, ఇతర ప్రముఖ అతిథులు ముంబై చేరుకున్నారు.

 

 

Exit mobile version