NTV Telugu Site icon

Anand Mahindra: “12th ఫెయిల్” ఐపీఎస్ జంట ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆనంద్ మహీంద్రా..

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: ‘12th ఫెయిల్’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు. యూపీఎస్‌సీ క్లియర్ చేయడానికి, ఐపీఎస్ కావడానికి ఓ సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన, 12వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనే ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్ర పోషించిన విక్రాంత్ మాస్సే నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

Read Also: Delhi: తప్పిపోయిన కొడుకు 22 ఏళ్లకు తిరిగొచ్చాడు.. ఆ తర్వాత ఏం షాకిచ్చాడంటే..!

ఇదిలా ఉంటే, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. తాజాగా ఈ రోజు ఆయన రియల్ 12th ఫెయిల్ జంట ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఆయన భార్య శ్రద్ధా జోషిని కలిశారు. వారి నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ‘‘ వారు నిజమైన నిజ జీవిత హీరోలు. ఈ రోజు లంచ్ సమయంలో వారిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. భారత్ ప్రపంచ శక్తిగా మారాలంటే ఎక్కువ మంది ప్రజలు వారి జీవన విధానాన్ని అవలంభిస్తే అది మరింత వేగమవుతుంది. వారిని కలిసినందుకు చాలా సంతోషిస్తున్నాను’’ అని ఆయన ఎక్స్‌లో రాశారు.