Site icon NTV Telugu

Bike Racer: ఎన్నో ప్రమాదకర స్టంట్స్‌ చేశాడు.. ఆ ఒక్క ఘటన బైక్‌ రేసర్‌ను ఇలా మార్చేసింది..

Bike Racer

Bike Racer

కొన్ని ఊహించని ఘటనలు.. తమ కళ్ల ముందు జరిగిన ప్రమాదాలు కొందరి మనస్సును పూర్తిగా మార్చేస్తాయి.. ఎన్నిసార్లు చెప్పినా.. చాలా సార్లు దొరికిపోయినా.. ఎందరో హెచ్చరించినా మనసు మార్చుకోని ఓ బైక్‌ రేసర్‌.. ఓ ఘటనను చూసిన తర్వాత పూర్తిగా మారిపోయాడు.. మారడంటే.. తాను ఒక్కడే మారడం కాదు.. చాలా మందిని మార్చే ప్రయత్నం మొదలు పెట్టాడు.. ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చాడు.. సిగ్నల్స్‌ వద్ద ప్రచారం చేయడం మొదటు పెట్టాడు.. ఇంతలా మారిపోయిన ఆ బైక్‌ రేసర్‌ ఎవరు? ఎందుకు అలా మారిపోయాడు అనే విషయాల్లోకి వెళ్తే…

Read Also: Tollywood: ఓరి దేవుడా… ఈ వారం ఇన్ని సినిమాలా!?

చెన్నై సిటీలో పలుమార్లు రేసింగ్‌తో పాటు బైక్‌తో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ వచ్చాడు అలెక్సా బెనైయ్ అనే యువకుడు.. ఎన్నోసార్లు హెచ్చరించారు.. పలుమార్లు పట్టుకున్నారు.. చివరకు పలు సందర్భాల్లో కేసులు పెట్టినా తీరు మార్చుకోలేదు.. అయితే, ఓ ఘటన ఆ యువకుడి మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేసింది.. నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తల్లి సహా బిడ్డ మరణించిన వార్త చూసి తట్టుకోలేకపోయిన ఆ యువకుడు.. పూర్తిగా మారిపోయాడు.. తాను ఒక్కడిని మారితే ఎలా.. మరికొందరిలో అవగాహన కల్పించాలని అనుకున్నాడేమో.. తేనాం పేటలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్‌ దగ్గర.. రేసింగ్‌లు, స్టంట్స్ చేయవద్దు.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ కరపత్రాలు పంచాడు.. ఓ ప్లకార్డు పట్టుకుని అందరికీ కనబడేలా దానిని ప్రదర్శించాడు.. ఆ యువకుడులో ఇంతలా మార్పు రావడాన్ని చూసి అభినందనలు తెలుపుతున్నారు తమిళనాడు యువత.. ఇక, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version