Uttar Pradesh: ఫాలోవర్ల కోసం ఎంతకు తెగించారు.. ఒకే వ్యక్తి ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిలో ట్విస్ట్..
- ఒకే వ్యక్తి-ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిలో షాకింగ్ ట్విస్ట్..
- ఫాలోవర్లను పెంచుకోవడానికే చేసినట్లు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో హసన్పూర్ ప్రాంతంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే, ఈ పెళ్లి విషయంలో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు మైనర్ అని తేలడంతో బాలల సంక్షేమ కమిటీ(CWC) జోక్యం చేసుకుని, 3 రోజుల్లో విచారణ ఇవ్వాలని కోరింది. కమిటీ ముందు హాజరైన వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ప్రజాధరణ, ఫాలోవర్లను పెంచుకోవడం కోసమే ఆ ఫ్రాంక్ వీడియోను చేసినట్లు లిఖితపూర్వక ప్రకటనలో ఒప్పుకున్నారు. పోలీసులు, హిందూ సంస్థల నుంచి ఒత్తిడికి భయపడి నిజం బయటపెట్టడానికి ఆలస్యం చేసినట్లు చెప్పారు.
బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరైన దేవిక అలియాస్ సావిత్రి, ఒకటి రెండు రోజుల్లో ఆ ఫ్రాంక్ వీడియో గురించి బయటపెట్టాలన్నదే తమ ప్రణాళిక అని ఒప్పుకుంది. తామంతా నిజమైన అక్కాచెల్లెళ్లం కాదని, కజిన్స్ అని కూడా వెల్లడించింది. ఇటీవల వైరల్ అయిన వీడియోలో ముగ్గురం ఇష్టపడే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఈ వీడియో చాముండ ఆలయానికి చెందినదని ప్రచారం జరిగినప్పటికీ, అక్కడి పూజారులు అలాంటి వివాహం జరగలేదని ఖచ్చితంగా ఖండించారు. ఈ వీడియోలో హసన్పూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, పలువురు మహిళలు కూడా కనిపించడం వివాదానికి దారితీసింది. నిరసనల మధ్య, ఆ వివాహం నిజమైనదేనని ఆ మహిళలు పేర్కొన్నారు.
Also Read
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
తాజావార్తలు
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!