NTV Telugu Site icon

Amritpal Singh: అమృత్ పాల్ సింగ్ సహాయకుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కొడుకుతో సంబంధాలు..

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘ వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం గత 10 రోజులుగా వేట సాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. అయితే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు. హర్యానా మీదుగా ఢిల్లీ చేరినట్లు తెలుస్తోంది. పూర్తిగా వేషధారణ మార్చి, తలపాగా తీసేసి మోడ్రన్ లుక్ తో తన రూపాన్ని మార్చుకుని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. నేపాల్ కు పారిపోయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు అమృత్ పాల్ సింగ్ ప్లాన్ చేస్తున్నాడు.

Read Also: Hit & Run Case: తార్నాకలో హిట్ & రన్.. ఆటోని ఢీకొన్న బెంజ్ కారు.. యజమాని పరార్

ఇదిలా ఉంటే అమృత్ పాల్ విషయంలో నెమ్మనెమ్మదిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అతడికి పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో పాటు విదేశాల్లో ఉన్న ఖలిస్తాన్ రాడికల్ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. పాకిస్తాన్ తో పాటు విదేశాల నుంచి నిధులు అందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

తాజాగా అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు దల్జీత్ కల్సీకి పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కుమారుడు సాద్ బజ్వాతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌కి చెందిన సాద్ బజ్వా కంపెనీతో కల్సికి సంబంధం కలిగి ఉన్నాడు. రెండు నెలల క్రితం కల్సీ దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. కల్సీ దుబాయ్ లో ఉండేందుకు ఖలిస్తానీ ఉగ్రవాది లాండా హరికే ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాంబిహా గ్యాంగ్‌కు సన్నిహితుడైన గ్యాంగ్‌స్టర్‌తో కూడా కల్సి సంబంధం కలిగి ఉన్నాడు. కల్సి కొంతకాలం ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంజాబ్ మోడలింగ్, సినీ కాంట్రాక్ట్ లకు ఏజెంట్ గా పనిచేశాడు.