NTV Telugu Site icon

Amit Shah: కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు.. రాహుల్‌గాంధీ మౌనం ఎందుకు..?

Amit Shah

Amit Shah

Amit Shah: హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. హర్యానాలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు వినిపిస్తున్నాయని అన్నారు. బాద్షాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని అన్నారు.

‘‘హర్యానాలో కొత్త ట్రెండ్ చూస్తున్నా. హతిన్ నుంచి థానేసర్ వరకు, థానేసర్ నుంచి పల్వాల్ వరకు కాంగ్రెస్ వేదికల వద్ద ‘‘పాకిస్తా జిందాబాద్’’ నినాదాలు వినిపిస్తున్నాయి. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నినాదాలను ఎందుకు లేవనెత్తుతున్నారు అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా..పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలపై కాంగ్రెస్ బుజ్జగింపులతో ఎందుకు మౌనంగా ఉంటుంది..’’ అని అమిత్ షా అన్నారు.

Read Also: Hassan Nasrallah: 60 అడుగుల లోతులో దుర్భేద్యమైన బంకర్.. అయినా, నస్రల్లాను ఎలా ఇజ్రాయిల్ చంపింది..?

‘‘జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ నేత ఇచ్చిన హామీపై రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కాశ్మీర్ మనది కాదా..? ఆర్టికల్ 370ని తొలగించాలా వద్దా..? ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకువస్తామని కాంగ్రెస్, రాహుల్ బాబాలు అంటున్నారు. రాహుల్ గాంధీ మూడు తరాలు కూడా ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకురావు. హర్యానా యువత కాశ్మీర్‌ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేశారు. వాటిని వృ‌థా కానివ్వబోం ’’ అని అమిత్ షా ధ్వజమెత్తారు.

ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం వక్ఫ్ బిల్లులో సవరణలు తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు చట్టం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని, ఈ శీతాకాల సమావేశాల్లో మెరుగుపరుస్తామని చెప్పారు. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరుగుతుండగా.. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.