Amit Shah: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఆగస్టు నెలలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిన తర్వాత ప్రస్తుతం ఆయన అధ్యక్షతన జరగబోయే భద్రతా సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు లొంగిపోవాలి లేదా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక, గత ఏడాది డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్ల తిరుగుబాటును పరిష్కరించడంలో సక్సెస్ అయిందన్నారు. ఈ సంవత్సర కాలంలో 90 మంది మావోయిస్టులు మృతి చెందారని, 123 మంది అరెస్ట్ కాగా, మరో 250 మంది పోలీసుల ముందు లొంగిపోయారని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తు చేశారు.
Read Also: Telangana Weather: ఉమ్మడి జిల్లాలో మళ్ళీ పెరిగిన చలి తీవ్రత.. సింగిల్ డిజిట్‌కు కనిష్ట ఉష్ణోగ్రతలు
ఇక, బస్తర్‌లోని భద్రతా బలగాల ఫార్వర్డ్ బేస్‌లో ఒక రాత్రి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు. అలాగే, అక్కడ నక్సల్స్ నియంత్రణ నుంచి విముక్తి పొందే ప్రాంతాలలో మౌలిక సదుపాయాల పనులను సమీక్షించనున్నారు. హింసను విస్మరించి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. దశాబ్దాల నాటి నక్సల్ సమస్యను అంతం చేసి, ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపును నెలకొల్పాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలకు భారీ షాక్ ఇచ్చాం.. ఇక, బస్తర్‌లో సేఫ్ జోన్‌లు లేవు.. అక్కడ శాంతిని నెలకొల్పడం మా యొక్క ప్రధాన లక్ష్యం అని అమిత్ షా వెల్లడించారు. అయితే, బుధవారం నాడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఢిల్లీలో అమిత్ షాను కలిసి.. రాష్ట్రంలో కొనసాగుతున్న మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలపై పూర్తి సమాచారాన్ని వివరించారు.