Site icon NTV Telugu

వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లు గెలుస్తాం: అమిత్‌షా

యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రియాంక గాంధీతో ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలు నిర్వహిస్తుంది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

https://ntvtelugu.com/rahul-gandhi-will-take-part-in-the-punjab-election-campaign/

ఉత్తర ప్రదేశ్‌ మొత్తం అసెంబ్లీ స్థానాలు 403 కాగా,2022లో వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో 300లకు పైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అమిత్‌ షా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో పేర్కొంది. కాగా యూపీలో ఉన్న పార్టీలు ఎస్పీ, బీఎస్పీ కులాల ఆధారంగా ఉన్న పార్టీలని అవి కేవలం కుల ప్రాతిపదికనే ఓట్లను చీల్చుతాయని ఆయన పేర్కొన్నారు. మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలోనే ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. మోడీ హయాంలో సబ్‌కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ జరుగుతుందని అమిత్‌ షా పేర్కొన్నారు.


Exit mobile version