Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Amit Shah Criticizes Mamata Banerjee West Bengal Elections Charge Sheet Bjp

Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు

Published Date :March 28, 2026 , 3:24 pm
By Suresh Maddala
  • ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది
  • మమతపై అమిత్ షా విమర్శలు
  • టీఎంసీ పాలనపై ‘‘ఛార్జ్‌షీట్‌’ను విడుదల చేసిన షా
Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా యావత్తు దేశానికి ముఖ్యమైనవని.. దేశ భద్రతతో ఎన్నికలు ముడిపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శనివారం కోల్‌కతాలో అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనపై ‘‘ఛార్జ్‌షీట్‌’ను అమిత్ షా విడుదల చేశారు. ఇది కేవలం బీజేపీ ఛార్జ్‌షీట్ మాత్రమే కాదని.. బీజేపీ గొంతుకగా నిలుస్తున్న బెంగాల్ ప్రజల ఛార్జ్‌షీట్ అని పేర్కొన్నారు. బెంగాలీయులు భయాన్ని ఎంచుకుంటారా? లేదంటే విశ్వాసాన్ని ఎంచుకుంటారా? అనేది రాబోయే ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. టీఎంసీ పాలనలో అవినీతి, హింస, వివక్షలతో నిండి ఉందని వర్ణించారు.

ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాధితురాలిగా కూడా నటిస్తారని మమతను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ‘‘కొన్నిసార్లు కాలు విరగ్గొట్టుకుంటుంది.. మరికొన్నిసార్లు తలకు కట్టు కట్టించుకుంటుంది.. బాధితురాలిగా నటిస్తుంది. ఇంకొన్ని సార్లు అనారోగ్యానికి గురైతే ఎన్నికల కమిషన్‌ను దూషిస్తారు.’’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

చార్జిషీట్‌లోని ముఖ్యాంశాలు..
1. బెంగాల్‌లో ‘సిండికేట్ రాజ్’ స్థాపించబడింది
2. రాష్ట్రం ‘అవినీతి ప్రయోగశాల’గా మారింది
3. వ్యవస్థలో వైట్-కాలర్ నేరగాళ్లు పాలుపంచుకుంటున్నారు
4. ‘కట్ మనీ’ సర్వసాధారణమైపోయింది
5. బెంగాల్ పరిశ్రమలకు ‘స్మశానం’గా మారింది
6. చొరబాటుదారులకు రక్షణ కల్పిస్తున్నారు
7. బుజ్జగింపు విధానం ప్రభుత్వ విధానంగా మారింది

బెంగాల్ ప్రజలు ఇప్పుడు ‘‘టీఎంసీ పాలన కంటే కమ్యూనిస్టు పాలన మేలు’’ అని చెప్పుకుంటున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు.

‘‘భయం నుంచి స్వేచ్ఛ’’ను ఎంచుకోవడం..

ఈ ఎన్నికలు అనేక రకాల ‘‘భయాల నుంచి విముక్తి’’కి సంబంధించినవని అమిత్ షా అన్నారు.

1. ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందనే భయం నుంచి విముక్తి
2. ఆస్తులు దోపిడీకి గురవుతాయనే భయం నుంచి విముక్తి
3. ఉద్యోగాలు కోల్పోతామనే భయం నుండి విముక్తి …
4. ఉద్యోగాలు కోల్పోతామనే భయం నుంచి విముక్తి
5.  మహిళల భద్రతకు సంబంధించిన భయం నుంచి విముక్తి
6. యువత భవిష్యత్తుపై కమ్ముకున్న చీకటి నుంచి విముక్తి

బెంగాల్‌లో 40 శాతం ఓట్ల వాటాతో బీజేపీ ఇప్పుడు బలమైన పునాది వేసుకుందని చెప్పారు. ఈ ఎన్నిక శాంతి, అభివృద్ధి, విశ్వాసానికి సంబంధించిన ఎన్నిక అని పేర్కొన్నారు. బెంగాల్‌లో చొరబాటుదారులను ఓటర్లుగా నమోదు చేశారని ఆరోపించారు. అటువంటి చొరబాటుదారులను దేశం నుంచి తరిమివేయడమే బీజేపీ అజెండా అని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఎవరు నిర్ణయిస్తారో బెంగాల్ ప్రజలే నిర్ణయించుకోవాలని హితవు పలికారు.

బీజేపీకి ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఉన్నచోట అభివృద్ధి వేగంగా జరిగిందని గుర్తు చేశారు.
1. ఉత్తర ప్రదేశ్‌లో అభివృద్ధి వేగం
2. మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ వృద్ధి
3. అస్సాంలో తిరుగుబాటు నుంచి అభివృద్ధి వైపు మార్పు
4. త్రిపురలో ‘కేడర్ పాలన’కు ముగింపు
5. ఒడిశాలో మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Amit Shah speech Kolkata
  • bengal politics
  • BJP charge sheet
  • BJP double engine government

తాజావార్తలు

  • Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు

  • Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?

  • Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..

  • New Digital Payment Rules: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. డిజిటల్‌ చెల్లింపుల కోసం ఇది తప్పనిసరి..!

  • Sundar C : తమిళనాడు ఎన్నికల బరిలో స్టార్‌ దర్శకుడు

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions