Site icon NTV Telugu

Amit Shah: బెంగాల్, తమిళనాడుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది..

Amitshah

Amitshah

Amit Shah: తమిళనాడులో పర్యటిస్తు్న్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా, అధికార పార్టీ డీఎంకేపై విరుచుకుపడ్డారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన పార్టీ డీఎంకే నాలుగేళ్లలో అవినీతికి సంబంధించి అన్ని పరిమితుల్ని దాటిందని ఆదివారం అన్నారు. మధురైలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిజ్ఞ చేశారు.

Read Also: Crime News: సూట్‌కేసులో 9 ఏళ్ల బాలిక.. అత్యాచారం చేసి, హత్య..

తమిళనాడులో డీఎంకే అవినీతికి కేంద్రంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం అందించిన రూ. 450 కోట్ల పోషకాహార కిట్లను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం ద్వారా వారు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, పేదలకు ఆహారం అందకుండా చేశారని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం రూ. 4600 కోట్ల ఇసుక కుంభకోణానికి పాల్పడిందని, దీని వల్ల రాష్ట్రంలోని పేద ప్రజలు అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేయాల్సి వచ్చిందని అన్నారు.

తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) కుంభకోణాన్ని హోంమంత్రి కూడా విమర్శించారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 39,000 కోట్లు నష్టం వాటిల్లిందని, లేకుంటే ఈ నిధులతో రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలకు అదనంగా రెండు గదులు నిర్మించడానికి ఈ నిధులను ఉపయోగించవచ్చని చెప్పారు.

Exit mobile version