NTV Telugu Site icon

Baramulla Encounter: ముగ్గురు ఉగ్రవాదులు హతమార్చిన సైన్యం.. పాక్ వైపు నుంచి కాల్పులు..

Jammu Kashmir Encounter

Jammu Kashmir Encounter

Baramulla Encounter: బారాముల్లా ఎన్‌కౌంటర్ లో భద్రత బలగాలకు కీలక విజయం లభించింది. పీఓకే నుంచి ఇండియాలో చొరబడేందుకు ప్రయత్నించి ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శనివారం బారాముల్లాలోని ఊరీ సెక్టార్ లో ఎల్ఏసీ వెంబడి ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేశాయి. అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ నాలుగు రోజులుగా కొనసాగుతున్న వేళ బారాముల్లా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.

Read Also: Madras High Court: వాక్ స్వాతంత్య్రం ద్వేషం కావద్దు.. “సనాతన ధర్మం”పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. అయితే మూడో వ్యక్తి డెడ్ బాడీని స్వాధీనం చేసుకునే సమయంలో పీఓకేలోని పాకిస్తాన్ పోస్టు నుంచి కాల్పులు జరిగినట్లు తెలిసింది. దీంతో మూడో ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆటంకం ఏర్పడినట్లు సైన్యం తెలిపింది. ఇంకా ఆపరేషన్ జరుగుతున్నట్లు సైన్యం తెలిపింది.

పీఓకేలో ఉగ్రవాద శిబిరాల నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అయితే భద్రతబలగాలు ఎప్పటికప్పుడు వీరి చర్యలను తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం, ఆ దేశ గూఢాచర సంస్థ ఐఎస్ఐ వీరికి అత్యాధునిక ఆయుధాలు, పరికరాలను అందిస్తోంది. భారత్ పైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది.