Modi Trump: అమెరికాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు విశేష స్పందన లభించింది. కొత్తగా ఏర్పడి ట్రంప్ ప్రభుత్వంలోని అధికారులను మోడీ కలుసుకున్నారు. వైట్ హౌజ్‌తో డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయి. ఇద్దరు నేతలు రెండు దేశాల మద్య వాణిజ్యంలోని అసమానతలప చర్చించారు, రెండు దేశాల మధ్య మెరుగైన ఆర్థిక సహకారం గురించి మాట్లాడారు.
Read Also: Donlad Trump: ‘‘బంగ్లాదేశ్‌ని మోడీకి వదిలేస్తున్నా’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించిన కొద్దిసేపటికే ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు. ఇది అమెరికా యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకరైన భారత్‌పై కూడా ప్రభావం చూపుతుంది. మరోవైపు, ‘‘భారత్‌తో అమెరికా అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు’’ చేసుకోబోతోందని ట్రంప్ వెల్లడించారు. ‘‘చరిత్రలో గొప్ప వాణిజ్య మార్గాల్లో ఒకటిని నిర్మించడంలో సహాయం చేసేందుకు అంగీకరించాము. భారత్ నుంచి ఇజ్రాయిల్ వరకు, ఆ తర్వాత అమెరికా వరకు వాణిజ్య మార్గం సాగుతుంది. మా భాగస్వామ్య దేశాలను రోడ్లు, రైల్వేలు, సముద్ర కేబుల్స్ ద్వారా కలుపుతాము’’ అని ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEC) గురించి మాట్లాడారు.
రెండు దేశాలు ఇంధనంపై ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, భారతదేశానిక అమెరికా చమురు, సహజవాయువు సరఫరాదారుగా మారబోతుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికా అణు పరిశ్రమ విప్లవాత్మక అభివృద్ధిలో, భారత మార్కెట్లో అత్యున్నత స్థాయిలో ఉన్న అమెరికా అణు సాంకేతిక ప్రవేశాన్ని సులభతరం చేయడానికి భారత్ తన చట్టాలను సంస్కరిస్తోంది. వారు మన చమురు, గ్యాస్‌ని ఎక్కువగా కొనుగోలు చేయబోతున్నారు. భారత్ అమెరికా కోసం మేము అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము’’ అని ట్రంప్ అన్నారు.