Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News America Imposes Sanctions On Six Indian Oil Companies Over Iran Petroleum Trade

Indian Oil Companies: మోడీ సర్కార్కు అమెరికా షాక్.. భారత చమురు కంపెనీలపై ఆంక్షలు

Published Date :July 31, 2025 , 9:45 am
By Chandra Shekhar Pamena
  • భారత్‌కు చెందిన చమురు కంపెనీలై అమెరికా ఆంక్షలు..
  • ఇరాన్‌ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసిన సంస్థలపై చర్యలు..
  • భారత్‌కు చెందిన 6 కంపెనీలు ఉన్నట్లు వెల్లడించిన అమెరికా విదేశాంగ శాఖ..
Indian Oil Companies: మోడీ సర్కార్కు అమెరికా షాక్.. భారత చమురు కంపెనీలపై ఆంక్షలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Indian Oil Companies: భారత్‌పై అగ్రరాజ్యం అమెరికా 25 శాతం టారీఫ్స్ విధించిన వేళ మరో కీలక పరిణామం జరిగింది. ఇండియాకు చెందిన చమురు కంపెనీలపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించింది. ఇరాన్‌ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు, మార్కెటింగ్‌ చేస్తున్నారు అనే అభియోగాలపై ప్రపంచ వ్యాప్తంగా 20 సంస్థలపై వైట్ హౌస్ చర్యలు తీసుకుంది. ఇందులో భారత్‌కు చెందిన 6 కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు యూఎస్ విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మిడిల్ ఈస్ట్ లో సంఘర్షణలు, అస్థిరతకు ఇరాన్‌ ఆజ్యం పోస్తుంది. సొంత దేశ ప్రజలతో పాటు, ప్రపంచాన్ని అణచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థికంగా సపోర్టు ఇస్తుంది. అందుకే టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు విధిస్తుంది. ఇరాన్‌ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వాములైన 20 కంపెనీలపై ఆంక్షలు అమలు చేస్తున్నామని అగ్రరాజ్యం ప్రకటన విడుదల చేసింది.

Read Also: Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ

Also Read

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
  • USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..

అయితే, భారత్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, తుర్కియే, ఇండోనేషియా దేశాలకు చెందిన కంపెనీల పైనా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆదేశాల మేరకు ఇరాన్‌ చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు తమ ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. అంతేగాక, అగ్రరాజ్యంతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారని అమెరికా హెచ్చరించింది.

Read Also: OG : ఓజీ మొదటి పాటకు కౌంట్‌డౌన్ షురూ.. డేట్ ఇదేనా ?

ఆంక్షలు విధించిన భారత కంపెనీలు ఇవే..

* కాంచన్‌ పాలిమర్స్‌: 2024 ఫిబ్రవరి నుంచి జులై మధ్య 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పాలిథీన్‌, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను UAE మధ్యవర్తిత్వ కంపెనీ నుంచి కొనుగోలు, దిగుమతి చేసుకున్నట్లు అగ్రరాజ్యం అమెరికా ఆరోపలు చేసింది.

* ఆల్‌కెమికల్‌ సొల్యూషన్స్‌: 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇరాన్ నుంచి 84 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను పెట్రోకెమికల్‌ ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకునట్లు అమెరికా పేర్కొంది.

* రమణిక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ: 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు 22 మిలియన్‌ డాలర్ల విలువైన మిథనాల్, టోల్యూన్‌, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను బైయింగ్, ఇంపోర్ట్ చేసుకున్నట్లు యూఎస్ తెలిపింది.

* జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్: 2024-25లో 49 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇరాన్ ఉత్పత్తులను ఇంపోర్టు చేసినట్లు అమెరికా తమ అభియోగాల్లో వెల్లడించింది.

* గ్లోబల్ ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌: గతేడాది కాలంలో 51 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్రోకెమికల్స్‌ను టెహ్రాన్ నుంచి కొన్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది.

* పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్: గతేడాది 14 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్‌తో సహా ఇరాన్ పెట్రో కెమికల్స్‌ను కొనుగోలు చేసినట్లు యూఎస్ ఆరోపణలు చేసింది. అయితే, ఈ కంపెనీలు అన్నీ ఉద్దేశపూర్వకంగానే టెహ్రాన్ తో వాణిజ్యంలో భాగస్వాములు అయ్యాయని అమెరికా చెప్పుకొచ్చింది. కాగా, ఈ ఆంక్షలు విధింపుతో ఇప్పుడు ఆయా కంపెనీలు, వ్యక్తులకు యూఎస్ లో ఆస్తులు ఉంటే వాటిని ఫ్రీజ్‌ చేయనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • india
  • Indian firms Iran oil imports
  • indian oil companies
  • Iran oil trade sanctions 2025

తాజావార్తలు

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..

  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!

  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..

  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి

  • Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions