Amartya Sen: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కలిసి పోరాడాల్సిందని ప్రముఖ నోబెల్ అవార్డ్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని తన పూర్వీకులు ఇంట్లో ఆయన పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతదేశం లౌకికవాదం మనుగడ సాగించాలంటే, ఐక్యత మాత్రమే కాకుండా, భారతదేశాన్ని బహుత్వానికి అద్భుతమైన ఉదాహరణగా మార్చిన విషయాలపై ఒప్పందం ఉండాలని అన్నారు. కాంగ్రెస్, ఆప్ మధ్య ఐక్యత అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
Read Also: Anji Reddy Chinnamile : కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి….
ఢిల్లీ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఆప్ గెలిచి ఉంటే, ఈ విజయం తన సొంత బలాన్ని కలిగి ఉండేదని అన్నారు. ఆప్ పరాజయం గురించి మాట్లాడుతూ.. ఢిల్లీలో హిందుత్వ ఆధారిత ప్రభుత్వం కోరుకోని వారిలో ఐక్యత లేకపోవడం కారణమని చెప్పారు. చాలా సీట్లలో ఆప్‌పై బీజేపీ ఆధిక్యం కన్నా కాంగ్రెస్‌కి లభించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. నిజానికి ఇండియా కూటమిలో ఆప్ ఓడిపోవాల్సిన అవసరం లేదు కానీ, ఓడిపోయిందని అన్నారు.
ఢిల్లీ ఎన్నికలు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సమాజ్ వాదీ పార్టీ ఏం చేసిందో, హిందుత్వ రాజకీయలకు వ్యతిరేకంగా బలమైన వైఖరి తీసుకుందో అలాగే ఆప్ చేయాలని అమర్త్యసేన్ చెప్పారు. ఢిల్లీ ఎన్నికలు బెంగాల్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. భారతదేశంలో ప్రతీ ఎన్నిక ఇతర ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. బెంగాల్‌లో టీఎంసీ, సీపీఎం, కాంగ్రెస్ వంటి లౌకిక పార్టీలు వేరేదారుల్లో వెళ్లినప్పటికీ, ఢిల్లీలో జరిగినట్లుగా ఇక్కడ జరిగే అవకాశం కనిపించడం లేదని అన్నారు.