NTV Telugu Site icon

Delhi: జూలై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

Amarnath Yatra

Amarnath Yatra

Delhi: భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్‌ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర ను జూలై 1 నుంచి ప్రారంభించనున్నారు. యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు శివ భక్తులతోపాటు సాధారణ భక్తులు రానున్నారు. మంచు కారణంగా యాత్రను నిలిపివేయగా.. తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. గత ఏడాది నిర్వహించిన అమర్‌నాథ్ యాత్రలో 3.45 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అటువంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

Read also: Hanuman Stotra: శని పరిహారాల కోసం ఈ స్తోత్ర పారాయణం తప్పక చేయండి

అమర్‌నాథ్‌కు వెళ్లే బట్కల్‌, పహల్‌గామ్‌ దారుల్లో భారీగా మంచు పేరుకొని ఉండటంతో జూన్‌ 15 నాటికి మంచును తొలగించే పనిని బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ చేపట్టింది. మరోవైపు యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఆరోగ్యకరమైన ఆహారాన్నే అనుమతించాలని అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు నిర్ణయించింది.

Read also: Chandigarh : దారుణంగా దంపతుల హత్య.. ఇంట్లో ఖరీదైన వస్తువులు చోరీ..

పవిత్ర మంచు లింగానికి నమస్కరించడానికి, భక్తులు జూన్-ఆగస్టు నెలలలో కాశ్మీర్ హిమాలయాలలో ఉన్న పవిత్ర గుహ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రను నిర్వహిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం 2000లో జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పాటైన శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డుచే నిర్వహించబడుతుంది. రాష్ర్ట లెఫ్టినెంట్ గవర్నర్ పుణ్యక్షేత్రం బోర్డు ఛైర్మన్‌గా వ్యవహారిస్తారు.