Kerala:| ఆపరేషన్ థియేటర్ లోకి హిజాబ్ ధరించి వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో తమకు వేరే వాటిని ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముస్లిం వర్గానికి చెందిన మహిళా వైద్య విద్యార్థినులు కోరారు. హిజాబ్‌కు బదులుగా లాంగ్ స్లీవ్ స్ర్కబ్ జాకెట్లు, సర్జికల్‌హుడ్స్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థినులు తిరువనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు.
Reas akso: Lust stories 2 : లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా..
2018, 2021, 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ లకు చెందిన ఆరుగురు విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను జూన్ 26న ప్రిన్సిపాల్‌కు అందజేశారు. ఆపరేషన్ రూమ్ లోపల హిజాబ్ ధరించలేమని కాబట్టి లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివే ముస్లిం విద్యార్థినులు ప్రిన్సిపాల్ ను కోరారు. ముస్లిం మహిళలు ఏ పరిస్థితుల్లోనూ హిజాబ్ ధరించడం తప్పనిసరి అని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆపరేషన్ థియేటర్ లోపల తల కప్పుకుని వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు.
హిజాబ్ ధరించిన మహిళలు హాస్పిటల్, ఆపరేషన్ గది నిబంధనలను పాటించేటప్పుడు, మతపరమైన దుస్తులు ధరించడం, నియమాన్ని కాపాడుకోవడం మధ్య సమతుల్యతను కాపాడటం చాలా కష్టమని లేఖలో పేర్కొన్నారు.
Reas akso: DK Shivakumar: “సిద్ధరామయ్య భయపడ్డారు..అదే నేనైతే”.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లినెట్ జె మోరిస్ ఈ లేఖను అందుకున్న విషయాన్ని ధృవీకరించారు. విద్యార్థుల నుంచి అలాంటి డిమాండ్ ఉందని, ఈ విషయాన్ని చర్చించవచ్చని వారికి తెలియజేశామని ‘ఏషియానెట్ న్యూస్ ఆన్ లైన్’ తో చెప్పారు. అయితే ఆపరేషన్ రూమ్ లో ఫుల్ హ్యాండ్ గౌన్ ధరించడం సవాలుతో కూడుకున్నదని పేర్కొంటూ ప్రిన్సిపాల్ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘రోగులను చూసుకునేటప్పుడు తరచూ చేతులు శుభ్రంగా ఉండాలి. లేదంటే అంటువ్యాధులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది’ అని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆపరేషన్ గదిలో ఏమి చేయాలో ప్రతి ఒక్కరికీ తెలుసునని.. శస్త్రచికిత్స గదుల్లో మోచేయి నుండి కిందకి తరచుగా చేతులు కడుక్కోవడం సాధారణమని ప్రిన్సిపాల్ మోరిస్ తెలిపారు. ఇదే ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేసినట్టు చెప్పారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండేందుకు సార్వత్రిక ప్రమాణాలను అనుసరిస్తామని స్పష్టం చేశారు. అయితే లేఖ ఆధారంగా విద్యార్థుల అభ్యర్థనలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
