Site icon NTV Telugu

Gyanvapi Mosque: జ్ఞాన్‌వాపి మసీదు కేసులో కీలక మలుపు.. అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Gyanvapi High Court

Gyanvapi High Court

Allahabad HC Allows Gyanvapi Mosque Survey: వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదులో ఏఎస్‌ఐ (ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) సర్వేకు కోర్టు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి.. జూలై 21వ తేదీనే వారణాసి జిల్లా జడ్జి జ్ఞాన్‌వాపి ఏఎస్‌ఐ సర్వేకు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి, మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని జడ్జి తెలపడంతో.. భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది.

Buggana Rajendranath : ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పులపై స్టేట్ మెంట్లు ఇస్తున్నారు

అయితే.. ముస్లిం కమిటీ దీన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టును ఆదేశించింది. సెషన్స్‌ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. అప్పుడు సర్వే ఆగిపోయింది. సుప్రీం ఆదేశాల మేరకు ముస్లిం కమిటీ.. వారణాసి కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జూలై 27న విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆగస్టు 3న తీర్పు వెలువడే దాకా సర్వే చేపట్టకూడదని పేర్కొంది. ఇప్పుడు తాజాగా విచారించిన హైకోర్టు.. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, తక్షణమే సర్వే ప్రారంభించాలని ఏఎస్‌ఐకి అనుమతి ఇచ్చింది.

Prostitution Racket: బయట మసాజ్.. లోపల పాడుపని.. ఇద్దరు మహిళలు అరెస్ట్

ఇక కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ బృందం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయనుంది. అయితే.. శివలింగం కనుగొనబడిన ప్రదేశాన్ని, సీల్డ్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మాత్రం సర్వే చేయదు. ఈ సర్వేలో గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు న్యాయవాది విష్ణు జైన్‌ తెలిపారు. మసీదు సముదాయం లోపల మధ్య గోపురం క్రింద నేల నుండి చప్పుడు శబ్దం వస్తుందని హిందూ పక్షం పేర్కొంది. దాని కింద ఒక విగ్రహం ఉండవచ్చని, దానిని కృత్రిమ గోడతో కప్పి ఉండవచ్చని ఒక వాదన ఉంది.

Exit mobile version