Site icon NTV Telugu

Schools Closed: భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్తలు.. మరో 2 రోజులు విద్యాసంస్థలకు సెలవు

Schools Closed

Schools Closed

Schools Closed: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు కవ్వింపు చర్యలు.. మరోవైపు.. ప్రజల నివాసాలపై సైతం కాల్పులకు తెగబడుతోంది పాక్‌.. అయితే, పాక్‌ పన్నాగాలను తిప్పికొడుతూనే.. ముందుస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది భారత్.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో అంతటా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. జమ్మూతో పాటు కాశ్మీర్‌ అంతటా అన్ని పాఠశాలలు నేడు మరియు రేపు మూసివేయబడతాయి.. ముందు జాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు మే 9 మరియు 10 తేదీలలో మూసివేయబడతాయని ప్రకటించారు జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ విద్యా శాఖ మంత్రి..

Read Also: #Single : శ్రీ విష్ణు #సింగిల్ ఓవర్సీస్ టాక్

కాగా, భారత్‌-పాకిస్థాన్‌ మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి.. ఓవైపు, పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతూనే.. మరోవైపు.. ఆ దేశంపై విరుచుకుపడుతోంది భారత్.. దీంతో, పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. నిన్న రాత్రి, పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) మరియు అంతర్జాతీయ సరిహద్దులు (IB) వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్లను పంపడానికి పాక్‌ విఫలయత్నం చేసింది.. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా మరియు పఠాన్‌కోట్ ప్రాంతాలలో పాక్‌ చర్యలకు భారత్ తిప్పికొట్టింది.. భారత ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలు ఉపయోగించి.. పెద్ద ఎత్తున కౌంటర్-డ్రోన్ ఆపరేషన్‌లో 50కి పైగా పాక్‌ డ్రోన్‌లను భారత్‌ విజయవంతంగా నిర్వీర్యం చేసిన విషయం విదితమే..

Exit mobile version