Arif Mohammed Khan: “వారు విద్యార్థులు కాదు, క్రిమినల్స్”.. సీఎం విజయన్‌పై గవర్నర్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arif Mohammed Khan: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎంగా పరిస్థితి మారింది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల కాలికట్ యూనివర్సిటీకి గవర్నర్ వెళ్లిన సమయంలో అధికార సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడం మరోసారి వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై గవర్నర్ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ టార్గెట్‌గా నేరుగా విమర్శలకు దిగారు.
తన వాహనాన్ని అధికార సీపీఎం విద్యార్థి విభాగం అడ్డుకుందని, తాను ఎవరికీ భయపడనని, నిరసన తెలిపిన విద్యార్థులంతా.. సీఎం విజయన్ నియమించిన ‘‘క్రిమినల్స్’’ అని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆరోపించారు. వారంతా నేరస్తులు, వారిని సీఎం నియమించి, వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
Read Also: Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన.. నిందితుల కాలిపోయిన ఫోన్లు, దుస్తులు స్వాధీనం..
గవర్నర్ పర్యటనకు ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాలికట్ యూనివర్సిటీ వెలుపల భారీ నిరసన ప్రదర్శన జరిగింది. కేరళలోని వివిధ యూనివర్సిటీల సెనెట్‌కి బీజేపీ-ఆర్ఎస్ఎస్ నియమిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ ఆరోపణలపై గవర్నర్ స్పందిస్తూ.. తాను భారత రాష్ట్రపతికి తప్పితే ఎవరికీ జవాబుదారీ కాదని అన్నారు. వివిధ సోర్సెస్ నుంచి వచ్చిన నామినేషన్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత తాను పేర్లను సిఫార్సు చేసినట్లు తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో గవర్నర్ వాహనంపై జరిగిన దాడి తర్వాత.. తనను భౌతికంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని సీఎంపై సంచనల వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌కి వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. రెండు మూడు చోట్ల ఆయన కారుకి అంతరాయం కలిగించారు.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్‌కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..