Site icon NTV Telugu

Arif Mohammed Khan: “వారు విద్యార్థులు కాదు, క్రిమినల్స్”.. సీఎం విజయన్‌పై గవర్నర్ ఆగ్రహం..

Arif Mohammed Khan

Arif Mohammed Khan

Arif Mohammed Khan: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎంగా పరిస్థితి మారింది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల కాలికట్ యూనివర్సిటీకి గవర్నర్ వెళ్లిన సమయంలో అధికార సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడం మరోసారి వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై గవర్నర్ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ టార్గెట్‌గా నేరుగా విమర్శలకు దిగారు.

తన వాహనాన్ని అధికార సీపీఎం విద్యార్థి విభాగం అడ్డుకుందని, తాను ఎవరికీ భయపడనని, నిరసన తెలిపిన విద్యార్థులంతా.. సీఎం విజయన్ నియమించిన ‘‘క్రిమినల్స్’’ అని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆరోపించారు. వారంతా నేరస్తులు, వారిని సీఎం నియమించి, వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు.

Read Also: Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన.. నిందితుల కాలిపోయిన ఫోన్లు, దుస్తులు స్వాధీనం..

గవర్నర్ పర్యటనకు ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాలికట్ యూనివర్సిటీ వెలుపల భారీ నిరసన ప్రదర్శన జరిగింది. కేరళలోని వివిధ యూనివర్సిటీల సెనెట్‌కి బీజేపీ-ఆర్ఎస్ఎస్ నియమిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ ఆరోపణలపై గవర్నర్ స్పందిస్తూ.. తాను భారత రాష్ట్రపతికి తప్పితే ఎవరికీ జవాబుదారీ కాదని అన్నారు. వివిధ సోర్సెస్ నుంచి వచ్చిన నామినేషన్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత తాను పేర్లను సిఫార్సు చేసినట్లు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో గవర్నర్ వాహనంపై జరిగిన దాడి తర్వాత.. తనను భౌతికంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని సీఎంపై సంచనల వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌కి వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. రెండు మూడు చోట్ల ఆయన కారుకి అంతరాయం కలిగించారు.

Exit mobile version