ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు మార్మోగుతోంది. ఢిల్లీ బ్లాస్ట్‌లో పాల్గొన్న అనుమానిత వైద్యులు అల్ ఫలాహ్‌లోనే పని చేస్తున్నారు. పట్టుబడ్డ వైద్యులు.. యూనివర్సిటీలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీపై అనేక కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: శుభకార్యంలో రెచ్చిపోయిన హిజ్రాలు.. డబ్బులు ఇవ్వలేదని గుంపుగా దాడి
ఈ నేపథ్యంలో అల్ ఫలాహ్ యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఢిల్లీ పేలుడు దురదృష్టకర సంఘటనగా పేర్కొంది. ఢిల్లీ పరిణామాలు తమను ఎంతగానో బాధించాయని.. తమ సంస్థపై వస్తున్న కథనాలను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. వైద్యులతో తమకు వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. 1997 నుంచి అనేక విద్యాసంస్థలు నిర్వహించామని.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌గా కూడా అధికారికంగా గుర్తించిందని వెల్లడించింది. 2019 నుంచి ఎంబీబీఎస్ కోర్సు నిర్వహిస్తున్నామని.. ఇక్కడ విద్యను అభ్యసించినవాళ్లు దేశ, విదేశాల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత దురదృష్టకర సంఘటనలు బాధించినట్లుగా పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఫరీదాబాద్‌లో పట్టుబడిన వైద్యులు.. ఇదే యూనివర్సిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: భూటాన్‌లో ‘కాలచక్ర అభిషేక’ను ప్రారంభించిన మోడీ
సోమవారం (10-11-2025) సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్-1 సమీపంలో కారు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.
