Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Akshay Kumar Humorous Take On Gas Crisis Reveals Electric Stove Plan For Home

Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి

Published Date :March 17, 2026 , 7:57 pm
By Suresh Maddala
  • ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభాలు
  • గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • వంటింటి గుట్టు వెల్లడించిన నటుడు
Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభాలు నెలకొన్నాయి. ఆయా దేశాల్లో గ్యాస్ సంక్షోభం తీవ్రంగా ఉంది. భారత్ మాత్రం ప్రస్తుతం సేఫ్ జోన్‌లో ఉంది. ఇప్పటి వరకైతే ఎలాంటి ఇబ్బందులు కనబడలేదు. కానీ సోషల్ మీడియా పుకార్లు కారణంగా అవసరం ఉన్నా.. లేకున్నా గ్యాస్ బండ్లను భద్రత చేసుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర పెద్ద ఎత్తున గృహ వినియోగదారులు క్యూలు కడుతున్నారు.

ఇలాంటి తరుణంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంటింటి గుట్టును బయటపెట్టారు. గ్యాస్ సంక్షోభం వేళ తన భార్య ట్వింకిల్ ఖన్నా ముందు జాగ్రత్తగా రెండు ఎలక్ట్రిక్ స్టవ్‌లను ఆర్డర్ చేసిందని తెలిపారు. ఆ రెండు స్టవ్‌లు ఇంకా ఇంటికి చేరాయో లేదో కూడా తనకు తెలియదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే దేశంలో గ్యాస్ సంక్షోభం లేదని కేంద్రం తెలిపింది. పెట్రోలియం అండ్ సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉందని హామీ ఇచ్చారు. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందక్కర్లేదని భరోసా ఇచ్చారు. ‘‘సహజ వాయువు విషయానికి వస్తే నేను మీకు చెప్పినట్లుగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులందరూ పీఎన్‌జీకి మారితే ప్రయోజనకరంగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఎల్పీజీ, పెట్రోలియం సరఫరాలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత చమురు ట్యాంకర్ ‘‘జగ్ లాడ్కి’’ ఫుజైరా నుంచి భారతదేశానికి ముడి చమురును తీసుకువస్తూ సురక్షితంగా బయలుదేరిందని వెల్లడించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ నిరంతరాయంగా లభించేలా తగిన చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు.

ఇక ఎల్పీజీ సిలిండర్ల కోసం భయాందోళనలతో బుకింగ్ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దేశంలో ఎక్కడా కూడా ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల దగ్గర సరఫరా నిలిచిపోయినట్లుగా నివేదికలు రాలేదని పేర్కొంది. అయినప్పటికీ అధిక సంఖ్యలో కాల్స్ రావడం వల్ల కొన్ని గ్యాస్ డిపోల దగ్గర వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడి.. పొడవైన క్యూలు ఏర్పడినట్లుగా అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: Trump-Cuba: క్యూబాలో అలుముకున్న అంధకారం.. ఏం జరుగుతోంది!?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshay Kumar comments
  • Akshay Kumar gas crisis
  • Akshay Kumar social media
  • Bollywood News
  • Electric stoves India

తాజావార్తలు

  • Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి

  • India Post: తపాలా శాఖ 3 కొత్త టైమ్-బౌండ్ ప్రీమియం సేవలు ప్రారంభం.. 24 & 48 Speed Postతో ప్రైవేట్ కొరియర్లకు చెక్!

  • Dhurandhar 2: సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికేట్.. రికార్డ్ రన్‌టైమ్! బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ విధ్వంసం

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Sanjay Dutt Nora Fatehi Controversy Song: సంజయ్‌ దత్-నోరా ఫతేహి అశ్లీల పాటపై ప్రభుత్వం సీరియస్‌.. కఠిన చర్యలకు ఆదేశాలు..

ట్రెండింగ్‌

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions