NTV Telugu Site icon

Ajit Pawar: రాజ్యసభ బరిలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..

Sunetra Pawar

Sunetra Pawar

Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ రాజ్యసభ బరిలో నిలిచారు. ఇటీవల మహారాష్ట్రలోని బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకి ప్రత్యర్థిగా నిలబడిన సునేత్రా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు రాజ్యసభ దారి ఎంచుకున్నారు. గురవారం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎన్సీపీ అభ్యర్థిగా పత్రాలను దాఖలు చేశారు. ‘‘రాజ్యసభ ఎన్నికలకు సునేత్ర పవార్‌ను పోటీకి దింపాలని ఎన్సీపీ నిర్ణయించింది. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నాను, కానీ బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో పార్టీ నేతలు ఆమె పేరును ఖరారు చేశారు’’ అని రాష్ట్ర మంత్రి , సీనియర్ ఎన్‌సిపి నాయకుడు ఛగన్ భుజ్‌బల్ చెప్పారు.

Read Also: Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు

పార్టీ నిర్ణయాన్ని అంతా అంగీకరించాలి. కొన్ని నిర్భందాలు ఉన్నాయని నేను స్వతంత్రుడిని కాదని, పార్టీ నాయకుడిని, కార్యకర్తనని ఛగన్ భుజ్‌బల్ అన్నారు. రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయనందుకు నిరాశ చెందారా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఇలా అన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ సభలో 10 ఖాళీలను నోటిఫై చేసింది. ఇందులో అస్సాం, బీహార్, మహారాష్ట్రలో రెండు స్థానాల చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో ఒక్కొక్కటి ఉన్నాయి.

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దారుణంగా దెబ్బతింది. మొత్తం 48 ఎంపీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలిచింది. ఇందులో బీజేపీ 09, శివనేన షిండే 07, ఎన్సీపీ అజిత్ పవార్ 01 సీట్లను గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి మాత్రం ఏకంగా 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ 13, శివసేన (ఉద్ధవ్) 09, ఎన్సీపీ శరద్ పవార్ 08 సీట్లను గెలుచుకున్నారు.