Maharashtra: ఒకే వేదికపై అజిత్ పవార్-శరద్ పవార్.. ఆసక్తి రేపిన సంఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలతో దూరంగా ఉంటున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్-ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ పరిణామం చూపర్లను ఆకట్టుకుంది. అయితే వేదికపైన ఇద్దరికి పక్కపక్కనే సీట్లు ఏర్పాటు చేశారు. అయితే స్టేజీ ఎక్కగానే నేమ్ ప్లేట్‌ను అజిత్ పవార్ మార్చేశారు. శరద్ పవార్ పక్కన సహకార మంత్రి బాబాసాహెబ్ పాటిల్ కూర్చునేలా ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Gadikota Srikanth Reddy: దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా..?
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు దిలీప్ వాల్సే పాటిల్ నేతృత్వం వహిస్తున్న షుగర్‌కు సంబంధించిన జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ వసంత్‌దాదా షుగర్ ఇన్స్టిట్యూట్ (వీఎస్‌ఐ) వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఇద్దరు నేతలు అజిత్ పవార్-శరద్ పవార్ పూణెకు వచ్చారు. అయితే వేదికపైన ఇద్దరికి పక్కపక్కనే సీట్లు వేశారు. కానీ అజిత్ పవార్ నేమ్ ప్లేట్ మార్చేశారు. దీంతో దూరంగా కూర్చోవల్సి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో కూడా బారామతిలో జరిగిన ‘2025 అగ్రికల్చర్ ఫెస్టివల్’ ప్రారంభ కార్యక్రమంలో కూడా ఇద్దరూ వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తన ప్రసంగంలో అజిత్ తన మామ గురించి ప్రస్తావించగా.. శరద్ పవార్ మాత్రం ప్రస్తవించలేదు. అంతేకాకుండా గత డిసెంబర్లో శరద్ పవార్ బర్త్‌డే సందర్భంగా ఢిల్లీలో శరద్ పవర్‌ను అజిత్ పవార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అజిత్ పవార్ తల్లి కూడా తిరిగి కుటుంబ సభ్యులు కలుసుకోవాలని సూచించారు. ఆ దిశగా చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్‌తో పాటు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే కూడా హాజరయ్యారు. అయితే ఇద్దరూ చిరునవ్వులకే పరిమితం అయ్యారు.
ఇది కూడా చదవండి: Maharashtra: ముంబైలో ట్రాఫిక్ కష్టాల పరిష్కారం కోసం సీఎం ఫడ్నవిస్ సరికొత్త ప్లాన్!
కార్యక్రమం అనంతరం అజిత్ పవార్‌ను నేమ్ప్లేట్లను మార్చడంపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పెద్దగా మాట్లాడాల్సిన అంశం లేదన్నారు. బాబాసాహెబ్ పాటిల్ మొదటిసారిగా సహకార మంత్రి అయ్యారు. శరద్ పవార్.. సాహెబ్‌తో మాట్లాడాలనుకున్నారు. అందుకే సీటింగ్ ఏర్పాట్లు మార్చమని కోరినట్లుని అజిత్ చెప్పారు.
#WATCH | Maharashtra: NCP-SCP chief Sharad Pawar and Dy CM Ajit Pawar shared stage during the annual general meeting of Vasantdada Sugar Institute in Pune. pic.twitter.com/38LdkF8u71
— ANI (@ANI) January 23, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!