NTV Telugu Site icon

Maharashtra: ఒకే వేదికపై అజిత్ పవార్-శరద్ పవార్.. ఆసక్తి రేపిన సంఘటన

Ajit Pawar Sharad Pawar

Ajit Pawar Sharad Pawar

మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలతో దూరంగా ఉంటున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్-ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ పరిణామం చూపర్లను ఆకట్టుకుంది. అయితే వేదికపైన ఇద్దరికి పక్కపక్కనే సీట్లు ఏర్పాటు చేశారు. అయితే స్టేజీ ఎక్కగానే నేమ్ ప్లేట్‌ను అజిత్ పవార్ మార్చేశారు. శరద్ పవార్ పక్కన సహకార మంత్రి బాబాసాహెబ్ పాటిల్ కూర్చునేలా ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Gadikota Srikanth Reddy: దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా..?

అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన నాయకుడు దిలీప్‌ వాల్సే పాటిల్‌ నేతృత్వం వహిస్తున్న షుగర్‌కు సంబంధించిన జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీఎస్‌ఐ) వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఇద్దరు నేతలు అజిత్ పవార్-శరద్ పవార్ పూణెకు వచ్చారు. అయితే వేదికపైన ఇద్దరికి పక్కపక్కనే సీట్లు వేశారు. కానీ అజిత్ పవార్ నేమ్ ప్లేట్ మార్చేశారు. దీంతో దూరంగా కూర్చోవల్సి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో కూడా బారామతిలో జరిగిన ‘2025 అగ్రికల్చర్ ఫెస్టివల్’ ప్రారంభ కార్యక్రమంలో కూడా ఇద్దరూ వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తన ప్రసంగంలో అజిత్ తన మామ గురించి ప్రస్తావించగా.. శరద్ పవార్ మాత్రం ప్రస్తవించలేదు. అంతేకాకుండా గత డిసెంబర్‌లో శరద్ పవార్ బర్త్‌డే సందర్భంగా ఢిల్లీలో శరద్ పవర్‌ను అజిత్ పవార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అజిత్ పవార్ తల్లి కూడా తిరిగి కుటుంబ సభ్యులు కలుసుకోవాలని సూచించారు. ఆ దిశగా చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్‌తో పాటు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే కూడా హాజరయ్యారు. అయితే ఇద్దరూ చిరునవ్వులకే పరిమితం అయ్యారు.

ఇది కూడా చదవండి: Maharashtra: ముంబైలో ట్రాఫిక్ కష్టాల పరిష్కారం కోసం సీఎం ఫడ్నవిస్ సరికొత్త ప్లాన్!

కార్యక్రమం అనంతరం అజిత్ పవార్‌ను నేమ్‌ప్లేట్‌లను మార్చడంపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పెద్దగా మాట్లాడాల్సిన అంశం లేదన్నారు. బాబాసాహెబ్ పాటిల్ మొదటిసారిగా సహకార మంత్రి అయ్యారు. శరద్ పవార్.. సాహెబ్‌తో మాట్లాడాలనుకున్నారు. అందుకే సీటింగ్ ఏర్పాట్లు మార్చమని కోరినట్లుని అజిత్ చెప్పారు.