Ajit Doval: “మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు”.. అజిత్ దోవల్ మాస్ వార్నింగ్..
- ఆపరేషన్ సింధూర్‌పై తొలిసారి మాట్లాడిన అజిత్ దోవల్..
- భారత సహనాన్ని బలహీనతగా భావించవద్దని దోవల్ వార్నింగ్..
- భారత్ అవసరమైతే రిస్కులు తీసుకుని గట్టిగా దెబ్బకొట్టగలదని కామెంట్స్..
- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్’ అనే డిస్కవరీ డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా ప్రసారం కానుంది. రెండు భాగాలుగా వచ్చే ఈ డాక్యుమెంటరీ ఇది ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్, దాని స్ట్రీమింగ్ సర్వీస్ అయిన డిస్కవరీ+లో ప్రసారం అవుతుంది. 88 గంటల పాటు సాగిన ఈ సైనిక ఆపరేషన్ వెనక ఉన్న వ్యూహాలు, నిర్ణయ ప్రక్రియపై దోవల్ ఇందులో వివరించనున్నారు.
భారత్ సహనంగా ఉంటే దేశమైనప్పటికీ, ఇది బలహీన దేశం కాదని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ‘‘మా సహనాన్ని బలహీనతగా పొరబడకండి. భారత్ రిస్కులు తీసుకోగలదు. అవసరమైతే గట్టి దెబ్బకొట్టగలదు’’ అని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని దోవల్ వెల్లడించారు. భారత సైనిక, జాతీయ భద్రతా నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ డాక్యుమెంటరీ చూపించనుంది.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
2025 ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన దారుణమై ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న ఆపరేషణ్ సిందూర్ చేపట్టారు. పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కు చెందిన ట్రైనింగ్ క్యాంపులు, కార్యాలయాలను ధ్వంసం చేశారు. పాక్ సైన్యం భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే, భారత్ తన క్షిపణులు, యుద్ధ విమానాలతో పాక్ ఎయిర్ ఫోర్స్ బేసుల్ని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ లోని 10కి పైగా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇందులో పాక్ ఎయిర్ ఫోర్స్, న్యూక్లియర్ కమాండ్ సెంటర్‌గా ఉన్న రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కూడా ఉంది. చివరకు పాక్ శరణు కోరడంతో కాల్పుల విరమణ జరిగింది. అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్థాన్‌ల మధ్య సైనిక ఘర్షణ దాదాపు 88 గంటల పాటు కొనసాగింది.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!