Site icon NTV Telugu

Ajit Doval: డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరిక.. రష్యా టూర్ కి అజిత్ దోవల్

Ahit

Ahit

Ajit Doval: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్‌పై 25 శాతం టారీఫ్స్ విధించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. ఈ క్రమంలో కీలక పరిణామం ఒకటి జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ (Ajit Doval) మాస్కో పర్యటనకు వెళ్లారు. అయితే, ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్-రష్యా మధ్య నేడు కీలక సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో భారత్-రష్యా మధ్య జరిగే చర్చల్లో అజిత్ దోవల్ పాల్గొననున్నారు.

Read Also: TheRajaSaab : వామ్మో రాజాసాబ్ రన్ టైమ్.. సీక్వెల్ కూడా ఉందా?

ఇక, రష్యాతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే ముఖ్య లక్ష్యంగా అజిత్ దోవల్ (Ajit Doval) పర్యటన చేస్తున్నారు. రష్యా నుంచి చమురు సరఫరాలు, పరిశ్రమల సహకారంతో పాటు మరిన్ని ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలు, రష్యాకు చెందిన ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలు వంటి కీలక అంశాలపై మాస్కో అధికారులతో ఎన్ఎస్జీ చీఫ్ దోవల్ చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ (S. Jaishankar) కూడా ఈ నెల చివరలో రష్యాలో పర్యటించనున్నారని సమాచారం. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధన, వాణిజ్యపరమైన అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో జైశంకర్ భేటీ కానున్నారు.

Exit mobile version