NTV Telugu Site icon

Anant Ambani Wedding: పెళ్లిలో ఎదురుపడ్డ ఐశ్వర్యరాయ్-రేఖ.. రియాక్షన్ ఇదే!

Reiee

Reiee

శుక్రవారం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం కన్నుల పండుగగా జరిగింది. వచ్చిన అతిథులంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. ఇక సినీ తారలు, క్రికెటర్లు అయితే డ్యాన్స్‌లతో అలరించారు. కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనందాలు పంచుకున్నారు.

ఇక కళ్యాణ వేదిక అయిన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ప్రవేశం దగ్గర ఐశ్వర్యరాయ్-అలనాటి హీరోయిన్ రేఖ ఎదురుపడ్డారు. ఐశ్వర్యరాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి లోపలికి వస్తుండగా రేఖ ఎదురుపడింది. రేఖ.. నవ్వుతూ పలకరించారు. ఐశ్వర్యరాయ్ మాత్రం హాయ్ అంటూ పలకరించి ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఫొటోగ్రాఫర్లు బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే ఐశ్వర్యరాయ్-ఆరాధ్య మాత్రమే వేదికపై ఫొటోలకు పోజులిచ్చారు. కానీ బచ్చన్ ఫ్యామిలీతో మాత్రం కలిసి కనిపించలేదు. ఇక అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్, ఆమె కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగితే.. ఐశ్వర్యరాయ్-రాధిక.. సెపరేటుగా ఫొటోలు దిగారు. శ్వేతతో పాటు ఆమె భర్త నిఖిల్ నందా, నటుడు, కొడుకు అగస్త్య నందా, కుమార్తె నవ్య నంద కూడా ఉన్నారు.

ఇక ఐశ్వర్య ఎరుపు-బంగారు అనార్కలీ, మ్యాచింగ్ దుపట్టాను మాంగ్ టికా, నెక్లెస్‌ ధరించింది. ఆమె వెంట కూతురు ఆరాధ్య కూడా ఉన్నారు. రేఖ బంగారు చీర, వెల్వెట్ మెరూన్ బ్లౌజ్, మ్యాచింగ్ నగలు, పొట్లీ బ్యాగ్‌తో కనిపించింది.