Air India Issues: ఎయిరిండియా విమానం పై నుంచి నీరు లీకేజీ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా తాజాగా స్పందించింది. నవంబర్ 24న గాట్విక్ నుండి అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా AI169 విమానంలో ఊహించని సంఘటన జరిగింది. ఒక చోట క్యాబిన్ పైకప్పు నుండి నీరు లీకైంది. లీకేజీ కింద సీటులో కూర్చున్న ప్రయాణికులను వెంటనే వేరే చోటికి తరలించారు. మేము ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి కట్టుబడి ఉన్నాము. ఊహించని ఈ ఘటనకు చింతిస్తున్నాం’ అని ఒక ప్రకటనలో తెలిపారు. అయితే లీకేజీకి గల కారణాలు తెలియరాలేదు.
Read also: New SIM Card: నేటి నుంచి మారుతున్న సిమ్ కార్డ్ రూల్స్.. అలా చేస్తే రూ.10 లక్షల జరిమానా..!
ఎయిరిండియా విమానం ఓవర్ హెడ్ బిన్ల నుంచి నీరు లీకైంది. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీటి లీకేజీని అరికట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ నీరు రాకుండా చేయలేకపోయారు. దీంతో లీకేజీ కింద కూర్చున్న ప్రయాణికులను మరోచోటికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. విమానాల్లో ఇది మామూలేనని, సాంకేతిక సమస్య వల్ల ఇలా జరుగుతుందని కొందరు చెప్పారు. అయితే విమానం నిర్వహణలో లోపాల వల్లే ఇలా జరిగిందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యంపై కొందరు మండి పడుతున్నారు. ప్రమాదం ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏదైన ప్రమాదం జరగిఉంటే మా ప్రాణాలకు ఎవరు బాధ్యులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nagarjuna Sagar: సాగర్ రగడ.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు