ఉక్రెయిన్ నుంచి భారత్‌కు విద్యార్ధులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎయిర్ ఇండియా విమానాలను ఏర్పాటు చేసి ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 700 మందికి పైగా విద్యార్ధులను ఉక్రెయిన్ నుంచి ఇండియాకు తరలించారు. ఉక్రెయిన్ నుంచి ఇండియాకు కేంద్రం ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విమానాలకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తున్నది. ఒక్కో విమానం ఇండియా నుంచి వెళ్లి అక్కడి నుంచి విద్యార్థులను తీసుకొని ఇండియాకు రావడానికి సుమారు రూ. 1.10 కోట్ల ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ ఎయిర్ ఇండియా విమానాలు నడపడానికి గంటకు రూ. 7 నుంచి 8 లక్షల ఖర్చు అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read: Zelensky: కమెడియన్‌గా కెరీర్… సూపర్ డ్యాన్సర్‌గా ప్రభంజనం…ఉక్రెయిన్ అధ్యక్షుడిగా సంచలనం…
