Air India: ఒకే రోజు 7 విమానాలు రద్దు.. ఇందులో 6 బోయింగ్ డ్రీమ్‌లైనర్స్..
- ఒకే రోజు 07 విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా..
- ఇందులో 06 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలే..
- అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైంది ఈ తరహా విమానమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటన తర్వాత, ఈ రోజు ఏకంగా 07 విమానాలను రద్దు చేశారు. రద్దు చేసిన విమానాల్లో 06 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ విమానాలు ఉన్నాయి. ఇటీవల, అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైంది ఈ రకం విమానమే. ముందుగా, సాంకేతిక లోపాల కారణంగా అహ్మదాబాద్ -లండన్, ఢిల్లీ-పారిస్ విమానాలను మంగళవారం రద్దు చేశారు. దీని తర్వాత, లండన్-అమృత్సర్, బెంగళూర్-లండన్ విమానాలు కూడా రద్దయ్యాయి.
రద్దు చేయబడిన విమానాలు ఇవే:
Also Read
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్‌కు మరో మైలురాయి
- Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
AI915 – ఢిల్లీ నుండి దుబాయ్ – B788 డ్రీమ్‌లైనర్
AI153 – ఢిల్లీ నుండి వియన్నా – B788 డ్రీమ్‌లైనర్
AI143 – ఢిల్లీ నుండి పారిస్ – B788 డ్రీమ్‌లైనర్
AI159 – అహ్మదాబాద్ నుండి లండన్ – B788 డ్రీమ్‌లైనర్
AI170 – లండన్ నుండి అమృత్సర్ – B788 డ్రీమ్‌లైనర్
AI133 – బెంగళూరు నుండి లండన్ – B788 డ్రీమ్‌లైనర్
AI179 – ముంబై నుండి శాన్ ఫ్రాన్సిస్కో – B777 డ్రీమ్‌లైనర్
“మా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము మరియు వీలైనంత త్వరగా వారిని వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. మేము హోటల్ వసతిని అందిస్తున్నాము. ప్రయాణీకులు రద్దు చేసుకుంటే ఉచిత రీషెడ్యూలింగ్‌పై పూర్తి వాపసులను కూడా అందిస్తున్నాము” అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
గత వారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 242 మందిలో ఒకరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. విమానం డాక్టర్స్ హాస్టల్‌పై కుప్పకూలడంతో నేలపై చుట్టుపక్కల ఉన్న 33 మంది వరకు మరణించారు.
తాజావార్తలు
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్‌కు మరో మైలురాయి
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!