Air Force Helicopter: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలోని పోర్పంధాల్ గ్రామంలో సోమవారం ఉదయం తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వెళ్తున్న శిక్షణ హెలికాప్టర్( IAF) అత్యవసరంగా ల్యాండ్ అయింది. అయితే, అది చూసిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక, సంఘటన ప్రదేశానికి వచ్చిన పోలీసులు.. ఈరోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యల ఏర్పాడినట్లు పైలట్లు కెప్టెన్ సంజీవ్, నీరజ్ లను అడిగి తెలుసుకున్నారు. అయితే, పోర్‌పంధాల్ సరస్సు వ్యవసాయ భూమికి ఆనుకుని ఉందని.. అదృష్టవశాత్తూ పైలట్లు నీటిలో పడిపోకుండా వరి పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
Read Also: Sourav Ganguly: సుప్రీంకోర్టు త్వరగా తీర్పు ఇవ్వాలని దాదా విజ్ఞప్తి..
ఇక, సాంకేతిక సమస్యతో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని తాంబరం ఎయిర్‌ఫోర్స్‌కు ఫైలెట్లు సమాచారం అందించారు. కొద్ది సేపటికే ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కూడిన మరో హెలికాప్టర్ ఘటనాస్థలికి చేరుకుంది. శిక్షణ ఛాపర్‌కు మరమ్మతులు చేసిన తర్వాత రెండు చాపర్లు మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కాగా, ఈ ఘటనపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. దీనికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం అందలేదని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్ అయినట్లు సమాచారం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు ఆ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ తో సెల్ఫీలు దిగేందుకు అక్కడికి చేరుకున్నారు.