Site icon NTV Telugu

Chennai: బీజేపీతో పొత్తుపై అన్నాడీఎంకే నేతల్లో అసంతృప్తి.. కీలక నేతలు రహస్య భేటీ

Aidmkbjp

Aidmkbjp

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ-అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదిరింది. అయితే ఈ పొత్తుపై అన్నాడీఎంకేలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. తిరుప్పూర్‌లో మాజీ మంత్రి జయరామన్‌ నేతృత్వంలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి పలువురు అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు హాజరయ్యారు. వక్ఫ్ చట్టం ద్వారా ముస్లింలకు అన్యాయం జరగకుండా చూడాలని నేతలు డిమాండ్ చేశారు. ఇక అన్నాడీఎంకే నేతల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలకు అన్యాయం జరగదని‌.. వారికి మేలే జరుగుతుందని బీజేపీ నేతలు అంటున్నారు.

ఇది కూడా చదవండి: Gold Rates: లక్షకు చేరువలో తులం బంగారం.. ఒక్కరోజే వెయ్యి పెరుగుదల

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కుదిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార డీఎంకేను గద్దె నుంచి దింపడమే లక్ష్యమని ప్రకటించారు.

ఇదిలా ఉంటే తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. ఓట్లు చీలకుండా.. డీఎంకేను ఓడించడమే లక్ష్యమని తెలిపారు. ఎన్నికల్లో కూటమి బలాన్ని నిరూపిస్తామని చెప్పారు. డీఎంకే వ్యతిరేకంగా కూటమి పని చేస్తుందని తెలిపారు. త్వరలో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో ఇతర పార్టీలు కూడా వస్తాయని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Robert Vadra: ప్రియాంకను కౌగిలించుకుని ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా

Exit mobile version