AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
- అన్నాడీఎంకేలో ముదిరిన వర్గపోరు..
- ఈపీఎస్, షణ్ముగం వర్గాల మధ్య ఘర్షణ..
- పార్టీ ఆఫీసుల కోసం రచ్చ రచ్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK: తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే పార్టీలో వర్గపోరు ముదిరిపోయింది. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), సీనియర్ నాయకుడు సీవీ షణ్ముగం వర్గాల మధ్య తీవ్ర పోరు నెలకొంది. శనివారం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. విల్లుపురం, కడలూరు లోని పార్టీ కార్యాయాల వెలపల ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
Also Read
- RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
- India-Iran: హార్ముజ్‌లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
- Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్..
- Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
విల్లుపురంలో, కొత్తగా నియమితులైన జిల్లా కార్యదర్శి పశుపతి ఏఐఏడీఎంకే పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. సీవీ షణ్ముగం వర్గానికి చెందిన కార్యకర్తలు, నేతలు ఆయన ప్రవేశాన్ని వ్యతిరేకించడంతో గొడివ ప్రారంభమైంది. రెండు వర్గాల మధ్య తోపులాట నెలకొంది. పశుపతి వర్గానికి చెందిన వారు పోలీసుల రక్షణ కోరుతూ, పార్టీ ఆఫీస్ తాళాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొడవ పెద్దది కావడంతో రెండు వర్గాలను పోలీసులు లోపలకి అనుమతించలేదు.
ఇక కడలూరులో కూడా అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఇలాంటి ఘర్షణ జరిగింది. షణ్ముగం వర్గం ఆఫీసుకు తాళాలు వేసింది. దీనికి ప్రతిస్పందనగా ఈపీఎస్ వర్గం తాళాలను పగలగొట్టి ప్రవేశించే ప్రయత్నం చేశారు. కరూర్తో సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘర్షణలే చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకేలో షణ్ముగం, వేలుమణి వర్గానికి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో పార్టీలో సంక్షోభం ఏర్పడింది. రెండు వర్గాల కారణంగా అన్నాడీఎంకే చీలిపోయింది.
తాజావార్తలు
-
AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
-
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
-
Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
-
RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
-
India-Iran: హార్ముజ్‌లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!