CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
- మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం విజయ్..
- హోంతో సహా కీలక శాఖలు ఆయన వద్దే..
- సెంగొట్టయ్యన్‌కు ఆర్థిక శాఖ, కీర్తనకు పరిశ్రమల శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం ఆయన మంత్రులకు శాఖలు కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి శాఖల్ని సీఎం విజయ్ తన వద్దే పెట్టుకున్నారు. శాఖల కేటాయింపులను పరిశీలిస్తే.. విజయ్ ప్రజా, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక కార్యక్రమాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, బాలల సంక్షేమం, వృద్ధులు- దివ్యాంగుల సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా శాఖల బాధ్యతలను తన వద్దే ఉంచుకున్నారు.
సీనియర్ నాయకుడు అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన సెంగొట్టయ్యన్‌కు ఆర్థిక శాఖను కేటాయించారు. విజయ్ కేబినెట్లో అతి చిన్న వయస్కురాలైన ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ లభించింది. దీంతో పాటు ఈమె పెట్టుబడుల ప్రోత్సహక విభాగాన్ని కూడా పర్యవేక్షిస్తారు. మహిళా మంత్రికి ఇలా కీలకమైన శాఖను కేటాయించడం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
- UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
- Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
ఎన్. ఆనంద్ గ్రామీణాభివృద్ధి , జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు ,పేదరిక నిర్మూలన కార్యక్రమం, చిన్న నీటిపారుదలతో సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలోని శాఖలలో ఉన్నాయి. టీవీకేలో మరో కీలక నేతగా ఉన్న అదవ్ అర్జునకు పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖల్ని కేటాయించారు. వీటితో పాటు రహదారులు, భవనాలు, చిన్నఓడరేవును కూడా పర్యవేక్షిస్తారు.
డాక్టర్ కేజీ అరణ్ రాజ్‌కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖల్ని కేటాయించారు. పి వెంటకరమణన్కు ఆహార, పౌర సరఫరాలను కేటాయించారు. ఆర్ నిర్మల్ కుమార్‌కు ఇంధన వనరులు, విద్యుత్, కోర్టులు, జైళ్లు, అవినీతి నివారణ వంటికి ఈయన పరిధిలో ఉండనున్నాయి. రాజ్‌మోహన్‌కు పాఠశాల విద్యా, తమిళ అభివృద్ధి, సమాచార మరియు ప్రచార శాఖల్ని స్వీకరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఈయనే ఉండనున్నారు. డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖను కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖను ఈయన నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!