Tamil Nadu Assembly election 2026: డీఎంకే అభ్యర్థి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న అన్నాడీఎంకే అభ్యర్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Assembly election 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. చెన్నైలోని గుమ్మడిపూండి నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఈ ఘటన వెలుగుచూసింది.. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఈ సంఘటన అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తరఫున టీజే గోవిందరాజన్ నామినేషన్ దాఖలు చేసి బయటకు వస్తుండగా, అదే సమయంలో అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అభ్యర్థి సుధాకర్ నామినేషన్ వేయడానికి అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో సుధాకర్ అకస్మాత్తుగా గోవిందరాజన్ వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
Read Also: Yuvraj Singh: “ఎక్కడి నుంచో వచ్చాడు.. కెప్టెన్ అయ్యాడు”.. ధోనిపై యూవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
ఈ సంఘటనతో అక్కడి రాజకీయ వర్గాలు, కార్యకర్తలు కొద్దిసేపు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అయితే గోవిందరాజన్ కూడా నవ్వుతూ సుధాకర్‌ను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించడం మరింత ఆసక్తికరంగా మారింది. సుధాకర్ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో సుధాకర్ గోవిందరాజన్ వద్ద అనుచరుడిగా పనిచేశారని, అదే గౌరవంతో ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారని చెప్పారు. రాజకీయంగా విభిన్న పార్టీల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉంటాయో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. ఈ ఘటన ప్రస్తుతం చెన్నై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!