Site icon NTV Telugu

Ahmedabad plane crash: “ఇంజన్ థ్రస్ట్ కోల్పోవడం”.. ఎయిరిండియా విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా..?

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash

Ahmedabad plane crash: ఎయిరిండియా నడుపుతున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కి బయలుదేరిన ఈ విమానంలో 242 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందకు పైగా ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. విమానం కుప్పకూలే ముందు సమీపంలోని డాక్టర్స్ హాస్టల్‌ని ఢీకొట్టింది. దీంతో 20 మంది మెడికోలు మరణించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను చూసిని విమానరంగ నిపుణులు ప్రమాదానికి కారణాలను అంచనా వేస్తున్నారు.

విమానం బయలుదేరినప్పుడు, దాని ల్యాండింగ్ గేర్ ఇంకా విస్తరించి ఉంది. రెక్కల్లోని ఫ్లాప్స్ పూర్తిగా ఉపసంహరించబడ్డినట్లు విశ్లేషకులు వెల్లడించారు. ఇది కీలకమైన విమాన టేకాఫ్ దశలో అసాధారణ పరిస్థితిగా చెబుతున్నారు. 787 స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానంలో టేకాఫ్ కోసం ఫ్లాప్స్‌ని 5 లేదా అంతకన్నా ఎక్కువ వద్ద సెట్ చేస్తారు. ఆ తర్వాత విమానం వేగం పుంజుకున్న తర్వాత, ఎత్తుకు చేరిన తర్వాత మాత్రమే ఫ్లాప్స్‌ని క్రమంగా ఉపసంహరించుకుంటారు.

Read Also: Aircraft Crashes: భారతదేశంలో జరిగిన 10 అతిపెద్ద విమాన ప్రమాదాలు..

పాజిటివల్ క్లైబ్ రేట్‌కి చేరిన తర్వాత ల్యాండింగ్ గేర్‌ని సాధారణంగా ఉపసంహరించుకుంటారు. టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత, 600 అడుగులకు చేరుకునే ముందు ల్యాండింగ్ గేర్‌ విమానంలోకి ముడుచుకుంటుంది. అయితే, విమాన ప్రమాదం సమయంలో ల్యాండింగ్ గేర్ ఇంకా విమానం బయటే ఉంది. ఇది బహుశా మెకానికల్ లేదా హైడ్రాలిక్ ఫెయిల్యూర్‌ని సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిబ్బంది ఫ్లాప్స్‌‌ని ముందుగానే ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించి ఉండవచ్చు. ల్యాండింగ్ గేర్ బయట ఉండటం, ఫ్లాప్స్ కలిసి అధిక డ్రాగ్‌ని సృష్టిస్తాయి. ఇది విమానం ఎగిరే పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది.

అయితే, తక్కువ ఎత్తులో, తక్కువ వేగంతో ఫ్లాప్స్‌ని త్వరగా ఉపసంహరించుకోవడం చాలా ప్రమాదకరం, ఎందుకుంటే ఇది విమానం లిఫ్ట్‌ని తగ్గించి, స్టాల్ ప్రమాదాన్ని పెంచి విమానం కూలిపోయేందుకు కారణమవుతుంది. ఈ సమస్యలు ఉన్నప్పటికీ, విమాన మార్గంలో సరిగానే ఉంది, దీనిని బట్టి చూస్తే పైలట్లు ఇంకా విమానంపై కొంత నియంత్రణ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

విమానం రైట్ రడ్డర్ పొజిషన్ అనుమానాలను పెంచుతోంది. ఇది ఎడమ ఇంజన్ ఫెయిల్యూర్‌ని సూచిస్తుంది. అయితే, ఇది ఒక్కటి గేర్, ఫ్లాప్స్ అసాధారణ కాన్ఫిగరేషన్‌ని వివరించదు. విమానం ఇంజన్ థ్రస్ట్ కోల్పోయినట్లు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పాజిబుల్ ఇంజన్ ఫెయిల్యూర్‌ని సూచిస్తుంది. దీని వల్లే విమానం ఎగిరేందుకు కావాల్సిన లిఫ్ట్‌ని పొందలేదని చెబుతున్నారు.

Exit mobile version