మాంసాహారం విక్రయాలపై గుజరాత్ సంచలన నిర్ణయం.. వారికి షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ సర్కార్ మాంసాహార విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రోడ్డుపై ఆహారం విక్రయించే వారిపై ప్రతీకూల ప్రభావం చూపుతుందనే ఆందోళన మొదలైంది… అహ్మదాబాద్‌లోని స్కూళ్లు, కళాశాలలు, మతపరమైన ప్రదేశాలకు 100 మీటర్ల పరిధిలో ఫుడ్‌స్టాళ్లలో మాంసాహారం విక్రయించడంపై నిషేధం విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తుండగా.. మరి కొందరు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.. ముఖ్యంగా చిరు వ్యాపారులు.. ఈ నిర్ణయం.. తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. తమ ఉపాధిని దెబ్బతీయడమేనని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు..
Read Also: దీదీ ఢిల్లీ బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
Also Read
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారాన్ని అనుమతించి.. రోడ్డు పక్కన స్టాళ్లలో మాత్రం అమ్మకూడదంటూ నిషేధం విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు.. రోడ్డు సైడ్‌లో ఉన్న స్టాళ్లలో మాత్రమే మాంసాహారమా..? హోటళ్లలో కాదా ? అని ప్రశ్నిస్తున్నారు.. ఇక, ఈ నిర్ణయం కాస్త వివాదాస్పదం కావడంతో.. ఈ వ్యవహారంపై స్పందించిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్.. ప్రజల భిన్నమైన ఆహారపు అలవాట్లతో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదన్నారు.. కానీ, పరిశుభ్రత, పౌర సమస్యలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ‘కొంతమంది శాఖాహారం తీసుకుంటారు.. మరికొందరు మాంసాహారం తింటారు.. కానీ, దీంతో బీజేపీ సర్కార్‌కు వచ్చిన నష్టమేమీ లేదన్న ఆయన.. అయితే, రోడ్డు పక్కన విక్రయించే ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయన్నారు.. కాగా, ఈ నిర్ణయం కేవలం చిరు వ్యాపారులపైనే కాదు.. రోడ్డు పక్కనే తక్కువ ధరకు దొరికే ఆహారాన్ని తీసుకునేవారిపై కూడా ప్రతీకూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.. స్కూళ్లు, కాలేజీలు, మతపరమైన ప్రదేశాలు.. అసలు లేనిది ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
-
Japan Squad: భారత్‌తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!