Site icon NTV Telugu

Agni-3: అగ్ని-3 మిస్సైల్ టెస్ట్ సక్సెస్.. పాక్‌లోని ప్రతీ ప్రాంతంపై ఆధిపత్యం..

Agni 3

Agni 3

Agni-3: ఇంటర్మీడియెట్ రేంజ్ సామర్థ్యం కలిగిన అగ్ని-3 మిస్సైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి దూసుకెళ్లింది. క్షిపణిలోని అన్ని పారామీటర్స్, ఆపరేషనల్స్ అన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పరీక్ష ఆయుధ వ్యవస్థ విశ్వసనీయత, సంసిద్ధతను నిర్ధారించింది. అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

READ ALSO: YS Jagan: ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? తగలబెడతారా..?

అగ్ని-3 మిస్సైల్ పరిధి 3000 కిలోమీటర్లు. అగ్ని రేంజ్‌లోని అగ్ని1 క్షిపణి రేంజ్ 700 కి.మీ, అగ్ని-2 క్షిపణి రేంజ్ 2000కి.మీ, అగ్ని -4 రేంజ్ 4000కి.మీ, ఇక అగ్ని-5 అత్యధిక దూరం 5000 కి.మీ పరిధిలోని అన్ని లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అగ్ని, బ్రహ్మోస్ క్షిపణులు 30 కి.మీ నుంచి 5000 కి.మీ వరకు అన్ని రకాల వ్యూహాత్మక లక్ష్యాలను సమర్థంగా ఛేదించగలవు. అగ్ని-3 క్షిపణి పరిధిలోకి పాక్‌లోని ప్రతీ ప్రదేశం వస్తుంది.

Exit mobile version