G20 Summit: పుతిన్ తర్వాత.. జీ20 సమ్మిట్‌కు జిన్‌పింగ్ డుమ్మా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ముస్తాబవుతోంది. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ20 దేశాధినేతలతో పాటు మరో 9 ఆహ్వానిత దేశాల అధినేతలు, అధికారులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా పుతిన్ పూర్తిగా సొంత దేశానికే పరిమితమయ్యారు. ఈ సమావేశాలకు పుతిన్ రావడం లేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ కూడా ఈ సమావేశాలకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పలు రిపోర్టులు వస్తున్నాయి. అయతే దీనిపై ఇటు చైనా విదేశాంగ అధికారులు కానీ, విదేశాంగ అధికారులు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశానికి వస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వాణిజ్యంగా, భౌగోళిక పరంగా అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు దేశాధినేతలు జీ20 వేదికగా సమావేశమవుతారని అంతా అనుకున్నారు. చివరిసారిగా గతేడాది ఇండోనేషియా బాలిలో జరిగిన జి20 సమావేశాల్లో బైడెన్, జిన్ పింగ్ సమావేశమయ్యారు.
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
Read Also: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో బాలికపై పాడుపని.. నిందితుడి అరెస్ట్..
ఇప్పటికే రష్యా అధినేత పుతిన్ రావడం లేదని చెప్పారు, తన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వస్తున్నట్లు తెలిపారు. జిన్ పింగ్ స్థానంలో చైనా ప్రధాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జీ20 సమావేశాలకు ముందు చైనా విడుదల చేసిన మ్యాపులు భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతను పెంచాయి. భారత అంతర్భాగాలైన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ చైనా తన భూభాగాలుగా పేర్కొంటూ మ్యాపులను విడుదల చేయడంతో వివాదం మొదలైంది. అయితే ప్రస్తుతం ఏ కారణాల వల్ల జిన్ పింగ్ హాజరు కావడం లేదనే విషయం తెలియదు.
- Tags
- china
- G20 Summit
- india
- Putin
- Xi Jinping
తాజావార్తలు
-
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!