Site icon NTV Telugu

Pakistan: భారత్‌పై యుద్ధానికి పాక్ ప్లాన్.. గగనతలం మూసివేత, స్కూళ్లకు సెలవులు..

Pia

Pia

Pakistan: భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. అయితే, తమ ప్రజల్ని సంతృప్తి పరిచేందుకు పాక్ ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఏర్పాటు చేసుకుంటుందనే సమాచారం అందుతోంది. ఇప్పటికే, ఈ ఆపరేషన్‌ని ‘‘యుద్ధ చర్య’’గా పాక్ పీఏం షహబాజ్ షరీఫ్ అభివర్ణించడంతో పాటు పాక్ ప్రతీకారం తీస్తుంటుందని నేషనల్ అసెంబ్లీలో ప్రకటించాడు. దాడికి సంబంధించి పాక్ ఆర్మీకి ఆదేశాలు ఇచ్చాడు.

Read Also: AI Video: “యుద్ధం ఆపేయండి” మోడీ కాళ్ల మీద పడిన పాకిస్థాన్ ప్రధాని.. వీడియో వైరల్

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తన వైమానిక గగనతలాన్ని 48 గంటల పాటు మూసేసింది. ఇప్పటి వరకు పాక్ తన గగనతలాన్ని కేవలం భారత విమానాలకు మాత్రమే మూసేసింది. ఇప్పుడు, పాక్ ఆర్మీ సొంత పౌర విమానాలతో సహా అన్ని విదేశీ విమానాలకు గగనతలాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని ముఖ్యమైన విమానాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రాబోయే 48 గంటల పాటు ‘‘నో ఫ్లై జోన్’’గా ప్రకటించింది. మరోవైపు, పంజాబ్ ప్రావిన్సులో మే 10 వరకు అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటించింది. పాకిస్తాన్ యుద్ధానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. వీటిన్నింటిని చూస్తే, రాబోయే కాలంలో భారత్‌పై ఏదైనా దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version