Pakistan: భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. అయితే, తమ ప్రజల్ని సంతృప్తి పరిచేందుకు పాక్ ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఏర్పాటు చేసుకుంటుందనే సమాచారం అందుతోంది. ఇప్పటికే, ఈ ఆపరేషన్‌ని ‘‘యుద్ధ చర్య’’గా పాక్ పీఏం షహబాజ్ షరీఫ్ అభివర్ణించడంతో పాటు పాక్ ప్రతీకారం తీస్తుంటుందని నేషనల్ అసెంబ్లీలో ప్రకటించాడు.