BJP Lok Sabha Candidates: గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం లోక్‌సభ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించింది. తొలి విడతలో 100 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు, త్వరలోనే జాబితా విడుదల చేస్తుందని తెలుస్తోంది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలతో దక్షినాదిన తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నివాసం నిన్న అమిత్ షా, జేపీ నడ్డా రాజ్‌నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్, మద్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల ఎంపీ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన బలహీన స్థానాలతో పాటు, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు కూడా తొలిజాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయం ప్రాంతీయ పార్టీల పొత్తుల కారణంగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో అకాలీదళ్, అన్నాడీఎంకేతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభలో ఎంపీలుగా ఉన్న పలువరు కేంద్రమంత్రులు ఈసారి లోక్‌సభ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయమంత్రి వీ మురళీధరన్ ఈసారి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ మరోసారి వారణాసి నుంచి అమిత్ షా గాంధీనగర్, రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా మధ్యప్రదేశ్ గుణ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ తరుపున ఎంపీగా ఉన్న శత్రఘ్ను సిన్హాకు పోటీగా బీజేపీ భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్‌ని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
