INDIA bloc: కాంగ్రెస్ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. అదికార బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దింపుతామంటున్న ఇండియా బ్లాక్‌లో లుకలుకలు కనిపిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తాము బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
Read Also: Ram Mandir: అయోధ్య రామాలయం టైమింగ్స్ మార్పు.. 10 రోజులు వీఐపీలు రావొద్దని విజ్ఞప్తి..
తాజాగా కూటమిలో కీలక పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా మమతా మార్గంలోనే నడుస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు లేదని స్పష్టం చేసింది. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి భవితవ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ యూనిట్ చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
