Bombay High Court: ఇండియాలో న్యాయపరమైన కేసులు కోర్టుల్లో దశాబ్దాలు కొనసాగుతుంటాయి. చివరకు విజయం మాత్రం దక్కుతుంది. బాధితులు న్యాయం కోసం చాలా ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి కొన్ని సార్లు ఉంటుంది. అటువంటి కోవలోకే చెందుతుంది ఓ మహిళ పోరాటం. పది కాదు 20 కాదు ఏకంగా తన ఆస్తిని దక్కించుకోవడానికి 80 ఏళ్లు న్యాయపోరాటం చేసింది. చివరకు 93 ఏళ్ల వయసులో ఆమెకు న్యాయం దక్కింది. తన ఆస్తిని దక్కించుకుంది. బాంబే హైకోర్టు విచారించిన ఈ కేసులో ఆస్తి వివాదానికి ముగింపు పలికింది. ఆస్తిని యజమాని అయిన 93 ఏళ్ల మహిళకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Also: Gold demand: ఇండియాలో ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం డిమాండ్..
వివరాల్లోకి వెళితే దక్షిణ ముంబైలోని ఫ్లాట్ కోసం ఈ న్యాయపోరాటం దశాబ్ధాలుగా కొనసాగింది. రూబీ మాన్షన్ లోని మొదటి అంతస్తులో ఉన్న 500, 600 రెండు ఫ్లాట్లకు సంబంధించింది. మార్చి 28, 1942న అప్పటి బ్రిటీష్ పాలకుల డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ప్రైవేటు ఆస్తులను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే జూలై 1946లో డీ-రిక్విజిషన్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్లాట్ లను యజమాని అలిస్ డిసౌజాకు తిరిగి అప్పగించలేదు.
తన ఆస్తిని అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముంబై కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ ఆస్తులు మాజీ ప్రభుత్వ అధికారి చట్టపరమైన వారసులచే ఆక్రమించబడింది. 8 వారాల్లో ఆస్తిని స్వాధీనం చేసుకుని శాంతియుతంగా పిటిషనర్ డిజౌజాకు అప్పగించాలని న్యాయమూర్తులు ఆర్‌డి ధనుక, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మే 4 నాటి తీర్పు చెప్పింది.