Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News African Swine Fever Detected In Tripura

African Swine Fever: మరో కొత్త వైరస్‌.. భారత్‌లో వెలుగుచూసిన ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ

Published Date :April 19, 2022 , 7:47 am
By Sudhakar Ravula
African Swine Fever: మరో కొత్త వైరస్‌.. భారత్‌లో వెలుగుచూసిన ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత్‌లో మబరో కొత్త వైరస్‌ కలకలం సృష్టిస్తోంది.. త్రిపురలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్‌) వెలుగుచూసింది.. సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్‌లో ఉన్న జంతు వనరుల అభివృద్ధి శాఖ (ఏఆర్‌డీడీ) నిర్వహిస్తున్న ఫారమ్‌లో ఈ తరహా కేసులు గుర్తించినట్టు తెలిపారు.. దీంతో, అప్రమత్తం అయిన అగర్తలలోని నిపుణుల బృందం… ఆ ఫారమ్‌ను సందర్శించి పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు ప్రారంభించింది.. దీనికోసం ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ నెల 7వ తేదీన శాంపిల్స్‌ సేకరించి టెస్ట్‌ కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ లాబోరేటరీకి పంపగా.. 13వ తేదీన వచ్చిన పీసీఆర్‌ ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారించారు. ఫారమ్‌లోని పందులకు ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉండడంతో.. ఫ్లూ ఫారమ్‌ మొత్తం వ్యాపించి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ అయిన తర్వాత పందులను సామూహికంగా ఉరితీయాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

Read Also: Astrology: ఏప్రిల్‌ 19, మంగళవారం దినఫలాలు

ఇక, భోపాల్‌లోని నేషనల్ డిసీజ్ డయాగ్నస్టిక్ ఇన్‌స్టిట్యూట్ నుండి రావాల్సిన మరో నివేదిక ఇంకా రాలేదని పశుసంవర్థక శాఖ రన్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ లాబొరేటరీలోని సీనియర్ అధికారి వెల్లడించారు.. మేం ప్రతి గ్రూపులో పది మందితో కూడిన రెండు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశాం.. బృందాలకు వెటర్నరీ అధికారి నాయకత్వం వహిస్తారు.. వారు నేరుగా నోడల్ అధికారుల ప్యానెల్‌కు నివేదిస్తారని తెలిపారు. మొదటి పందులను సామూహికంగా చంపేయడం.. ఆ తర్వాత వైరస్‌ సోకిన పందులను పాతిపెట్టడానికి 8 అడుగుల మేర లోతైన గుంతలను తోవి అందులో పాతిపెట్టనున్నారు. దీనిపై అధికార ప్రకటనపై మీడియా ప్రశ్నించగా.. పరిశోధకులు భారత ప్రభుత్వానికి లేఖ రాస్తారు.. కేంద్రం ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శికి తెలియజేస్తుందని తెలిపారు. అధికారిక లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన తర్వాత మాత్రమే అన్ని తదుపరి ప్రక్రియలు నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇక, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 63 పందులు.. గుర్తు తెలియని కారణాలతో చనిపోయాయని.. ఆ పందుల షెడ్డులో 265 పందులు మరియు 185 పంది పిల్లలు ఉన్నాయని వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • African Swine Fever
  • Agartala
  • Agartala's disease investigation Centre
  • Pigs
  • Tripura

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

  • IND vs WI: ఈడెన్‌లో వెస్టిండీస్ ప్లేయర్ల గర్జన.. భారత్ ముందు భారీ లక్ష్యం!

  • Pakistan: ఖమేనీ మరణం.. పాక్ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు ‘‘డబుల్ ట్రబుల్’’..

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions