Site icon NTV Telugu

Assembly Election Results 2022: దీదీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చాయి.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పవర్‌ కోల్పోగా.. మిగతా రాష్ట్రాల్లోనూ పెద్దగా చెప్పుకోదగిన పోటీ ఇవ్వలేకపోయింది.. దీంతో ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.. ఇదే ఇప్పుడు టీఎంసీ అధినేత్రి, వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం అయ్యింది.. ఎన్నికల ఫలితాలపై స్పందించిన దీదీ.. కాంగ్రెస్‌ విశ్వనీయతను ప్రశ్నించారు.. అయితే, దీదీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి… దీదీ… బీజేపీ ఏజెంట్‌ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కున్న ఉనికి గురించి మాట్లాడుతూ… మొత్తం ప్రతిపక్ష ఓట్ల వాటాలో కాంగ్రెస్‌కు 20 శాతం ఉందని, మీ పార్టీ వైఖరేంటో చెప్పాలంటూ మమతా బెనర్జీని నిలదీశారు..

Read Also: DK Aruna: కేసీఆర్‌ ఫ్యామిలీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి..!

కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దీదీ మాట్లాడుతూ.. బీజేపీతో పోరాడాలనుకున్న పార్టీలన్నీ ఏకతాటిపై నడవాలని, కాంగ్రెస్‌ తన విశ్వసనీయతను కోల్పోయింది, దానిపై ఆధారపడేది లేదని పేర్కొన్నారు.. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ అధిర్‌ రంజన్‌ చౌదరి… పిచ్చోళ్లకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి 700 మంది ఎమ్మెల్యేలున్నారు. మరి? దీదీకి ఎంత మంది ఉన్నారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మొత్తం ఓట్ల వాటాలో కాంగ్రెస్‌కు 20 శాతం ఉందని.. ఆమెకు ఇంత వాటా ఉందా? అని నిలదీశారు.. భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు, దాని ఏజెంటుగా వ్యవహరించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. కాంగ్రెస్‌ లేకుంటే ఆమె రాజకీయంగా ఎలా పుట్టేదంటూ ధ్వజమెత్తారు.

Exit mobile version