Assembly Election Results 2022: దీదీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చాయి.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పవర్ కోల్పోగా.. మిగతా రాష్ట్రాల్లోనూ పెద్దగా చెప్పుకోదగిన పోటీ ఇవ్వలేకపోయింది.. దీంతో ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.. ఇదే ఇప్పుడు టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం అయ్యింది.. ఎన్నికల ఫలితాలపై స్పందించిన దీదీ.. కాంగ్రెస్ విశ్వనీయతను ప్రశ్నించారు.. అయితే, దీదీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి… దీదీ… బీజేపీ ఏజెంట్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కున్న ఉనికి గురించి మాట్లాడుతూ… మొత్తం ప్రతిపక్ష ఓట్ల వాటాలో కాంగ్రెస్‌కు 20 శాతం ఉందని, మీ పార్టీ వైఖరేంటో చెప్పాలంటూ మమతా బెనర్జీని నిలదీశారు..
Read Also: DK Aruna: కేసీఆర్ ఫ్యామిలీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి..!
Also Read
- Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
- Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
- Karnataka: డీకే.శివకుమార్‌కు కేబినెట్ విస్తరణ తలనొప్పి.. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
- Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దీదీ మాట్లాడుతూ.. బీజేపీతో పోరాడాలనుకున్న పార్టీలన్నీ ఏకతాటిపై నడవాలని, కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయింది, దానిపై ఆధారపడేది లేదని పేర్కొన్నారు.. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ అధిర్ రంజన్ చౌదరి… పిచ్చోళ్లకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 700 మంది ఎమ్మెల్యేలున్నారు. మరి? దీదీకి ఎంత మంది ఉన్నారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మొత్తం ఓట్ల వాటాలో కాంగ్రెస్‌కు 20 శాతం ఉందని.. ఆమెకు ఇంత వాటా ఉందా? అని నిలదీశారు.. భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు, దాని ఏజెంటుగా వ్యవహరించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. కాంగ్రెస్ లేకుంటే ఆమె రాజకీయంగా ఎలా పుట్టేదంటూ ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!