Site icon NTV Telugu

Rahul Gandhi: గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయండి..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: సౌర విద్యుత్తు కాంట్రాక్టుల కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు అదానీ గ్రూప్ 2,200 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే అభియోగాలు దేశంలో సంచలనం రేపుతున్నాయి. ఇక, గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ ఛేంజ్ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. తాజాగా, ఈ వ్యవహారంపై లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Parliament Winter Session: లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా

గౌతమ్ అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు.. కానీ, ఈ విషయంలో కేంద్ర సర్కార్ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. ఈ అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. లంచాల ఆరోపణలను గౌతమ్ అదానీ ముమ్మాటికీ ఒప్పుకోరని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Supreme Court: ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పే..

అయితే, మరోవైపు రాజకీయ లబ్ది కోసమే అదానీ వ్యవహారాన్ని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ మండిపడ్డారు. అమెరికా న్యాయస్థానంలో వచ్చిన ఆరోపణలను గుడ్డిగా అనుసరించడం పద్దతి కాదన్నారు. భారత గ్రోత్ స్టోరీని అడ్డుకునే కుట్రతోనే యూఎస్ ఈ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. భారత శత్రు దేశాలతో కూడా పోటీ పడి అదానీ గ్రూపు ఈ కాంట్రాక్టులు పొందిందని మహేష్ జెఠ్మలానీ అన్నారు.

Exit mobile version